ఉద్దేశ్యం

ఈ బ్లాగు యొక్క ఉద్దేశ్యం విషవృక్షం పుస్తకాన్ని సమీక్షించి ఆ పుస్తకం రచయిత్రి రామాయణం గురించి చేసిన కువిమర్శలు/విషప్రచారాలను బయట పెట్టడం. ఇందులో రచయిత్రి వ్యక్తిగత విషయాలు గానీ, అసభ్య పదజాలం గాని ఉండదు. ఒక వేళ ఎవరి వ్యక్తిగత విషయాలైనా చర్చకువస్తే అది ఏదో ఒక విషయాన్ని స్పష్టం చేయడానికే తప్ప అవమానించడానికి మాత్రం కాదు. గమనించగలరు!

Wednesday 6 June 2012

పీఠికలోనే మొదలైన పీడ: వంకర లాజిక్కులు

రుషులపైన అక్కసు:
పదేళ్ళు వర్షాలు లేవు లోకమంతా దగ్ధమవుతూ ఉంది. అనసూయ తన పాతివ్రత్యం తో రుషులకోసం చెట్లకి పళ్ళు, గంగలో నీళ్ళూ సృష్టించింది. ఇదీ కథ! దీని మీద కూడా మనలోకజ్ఞానం ప్రశ్నల వర్షం కురిపిస్తుంది- " ఏ మనిషికైనా పళ్ళూ, నీళ్ళూ సృష్టించడం  సాధ్యమౌతుందా?? అంత సృష్టించగలిగేప్పుడు పళ్ళని చెట్లకే సృష్టించడం ఎందుకూ? చెట్లెక్కే శ్రమ మాత్రం ఎందుకు?? పళ్ళని చేతుల్లోనే సృష్టించరాదూ??" ఇలా ఎంతైనా తర్కించవచ్చు. కానీ, మన ప్రశ్నలు ఇంతటితో ఆగిపోతే ఈ కథనుంచీ మనం తెలుసుకోగలిగేది ఏమీ ఉండదు. ఈ కథలో కొన్ని సాంఘిక విషయాలు ఉన్నాయి. అవేమంటే స్త్రీలు పూర్తిగా పాతివ్రత్యాన్ని ఆమోదించారు. అది సమాజం లో గౌరవప్రదం అయిపోయింది. అంతే కాదు, ఆ పతీవ్రత పళ్ళూ, నీళ్ళూ సృష్టించింది ఎవరికోసం? రుషుల కోసం! రుషులకోసం మాత్రమే ఎందుకు సృష్టించాలి? లోకాలన్నీ దగ్ధమౌతున్నప్పుడు ప్రజలందరూ కష్టాలు పడుతుండరా? అందర్నీ రక్షించాలి కదా?? "సమస్త జనుల కోసం సృష్టించింది" అని ఎందుకు చెప్పలేదు. ఎందుకంటే చెప్పేవారికి సమస్త జనుల శ్రేయస్సు  అవసరం లేదు గనక, రుషుల రక్షణ ఒక్కటే వారి ధర్మం గనక! ఎవరికి శక్తిసామర్థ్యాలున్నా, ఎక్కడ సిరిసంపదలున్నా అవి రుషుల శ్రేయస్సుకే ఉపయోగ పడాలి ఎందుచేత ఇతర ప్రజల సంగతేమిటి??

చెట్లెక్కే శ్రమ ఎందుకూ అని రంగనాయకమ్మ కు అనిపించి ఉండచ్చు. కానీ అప్పటి ప్రజలు రంగనాయకమ్మ అంత సోమరులు కాదని  వాల్మీకి మహర్షికి తెలుసు కాబోలు అందుకే అలా రాశాడు.ఇక రుషుల మీద అక్కసు మిగిలిన పేరాలో  ఎత్తికొట్టినట్టు కనిపిస్తుంది. ఆ పళ్ళూ, నీళ్ళు అనసూయ సృష్టించింది రుషులకు మాత్రమే అని ఎక్కడ చెప్పారు?? అవి రుషులకోసం అంటే మిగిలినవారికి కాదు అనుకోవడం ఒక ఊహ తప్ప నిజం కాదు. ఇది పక్కన పెడితే, ఎవరికోసం చెయ్యాలో అనసూయకు రంగనాయకమ్మ చెప్పడం ఏమిటి ? ఆమె పాతివ్రత్య బలం తో ఆమెకు ఇష్టమైనవాళ్ళకు మేలు చేస్తుంది. ప్రజలందరికీ మేళ్ళు చేయడానికి అనసూయ పబ్లిక్ సర్వెంట్ కాదు, బాండేడ్ లేబర్ అంతకు ముందే కాదు. ఇంకా నయం , అనసూయ తన పాతివ్రత్య బలం తో మార్కిస్టులకు సకల సదుపాయాలు ఇవ్వాలని వాదించలేదు. ఇలాంటి అర్థం లేని వాదనలు ఈ పుస్తకం లో చాలానే ఉన్నట్టున్నాయి. రాజు పెద్దభార్య సామెత లాగా మాటిమాటికి సాధారణ ప్రజల ప్రస్తావన తెచ్చి వాళ్ళను విక్టిమైజ్ చెయ్యాలని చూడటం ఈ పుస్తకం లో తరచుగా కనిపిస్తుంది. ఎందుకంటే, సాధారణ ప్రజల గురించి వకాల్తా పుచ్చుకున్నట్టు ఎంత ఎక్కువ ఫోజు కొడితే అంత ఎక్కువ మార్కెట్ పెరుగుతుంది. ఈ పుస్తకం రాసినప్పుడు మన రాష్ట్రంలో కమ్యూనిస్టులు చెప్పుకోదగ్గ సంఖ్య లో ఉండేవాళ్ళు ఇలాంటివి రాయకపోతే వాళ్ళెవరూ ఈ పుస్తకాన్ని కొనరు. మార్కెట్ ప్రకారం రచనలు చెయ్యకపోతే కమర్షియల్ రచయితలకు విలువలేదు.

ఇక రాజులవంతు:
రాముడి పట్టాభిషేకం వార్త తెలియగానే కైక ఉదాసీనంగా ఉంటుంది. దశరథుడు కారణం తెలియనట్టు ఆమెని బతిమాలుతూ ఇలా అంటాడు -  "కైకేయీ ఎందుకీ విచారం చెప్పు? నువ్వేం కోరితే అది చేస్తాను. ఎవరినైనా చంపించాలని ఉందా, చెప్పు? అతడెంత నిర్దోషి అయినా నీ సంతోషం కోసం చంపేస్తాను. ఎవర్నైనా రక్షించాలని ఉందా , చెప్పు? అతడెంత దోషి అయినా శిక్ష రద్దు చేస్తాను. ఈ విధంగా సాగుతుంది దశరథ మహారాజు గారి ప్రేలాపన. ఏ రాజైనా తను తల్చుకున్నది యధేచ్చగా న్యాయాన్యాయాలతో సంబంధం లేకుండా చేసెయ్యగలడన్నమాట. రాజు ప్రాపకం గానీ రాణుల ప్రాపకం గానీ సంపాదించుకుంటే ఎటువంటి కార్యాలైనా సాధించుకోగలరన్నమాట. వారి ఆగ్రహానికి గురైన వారు, అతీగతీ లేకుండా సర్వ నాశనం అయిపోతారన్నమాట. అందుచేత ఒక వ్యక్తి చేసే నిరంకుశ పాలన లో ప్రజలకు న్యాయం జరగడం కల్ల. దశరథుడు న్యాయం చేసినా అంతే; రాముడు రాజ్యం  చేసినా అంతే; పుల్లయ్య  రాజ్యం చేసినా అంతే!

"రాజులకు అన్యాయాలు చేసే అవకాశం ఉండేది" అని చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే పైన పేరాలో ఎక్కడ కూడా దశరథ మహారాజు అన్యాయాలు చేసినట్టు చెప్పలేదు. చెయ్యగలనని చెప్పాడు. ఒకమనిషి ఒక పని చెయ్యడం వేరు చేస్తానని చెప్పడం వేరు. అప్పటికాలం లోని తర్కజ్ఞానం గురించి అవాకులు, చెవాకులు పేలిన రంగనాయకమ్మ ఈ మాత్రం తార్కిక దృష్టితో ఆలోచించలేకపోవడం కడు విషాదం. ఒక భర్త తన భార్య అలక తీర్చడానికి చెప్పిన మాటలను బట్టి ఆయన అలా చేశాడనే కంక్లూజన్ కు రావడం ఏ తర్క జ్ఞాన పుస్తకం లో ఉందో నాకైతే తెలియదు. ఇక మరోసారి జెనరలైజేషన్; దశరథ మహారాజు అలా చేయగలనని చెప్పాడు, దాన్నుంచీ రాజులందరూ అన్యాయాలు మాత్రమే చేస్తారని చెప్పడం.. ఎలాగైనా రాజులను తప్పు పట్టాలన్న దుర్బుద్ది తప్ప మరొకటి కాదు.  వ్యక్తిపాలనలో న్యాయం జరగదు అని చెబుతున్న రంగనాయకమ్మ నియంతృత్వ పోకడలకు మారుపేరైన కమ్యూనిజాన్ని సమర్ధించడం గురివింద నైజం. 

గంగ ఒడ్డు దిగాక సుమంత్రుడితో రాముడు: భరతుడిని, నా తండ్రినీ సేవించుకుంటూ ఉండు! రాజులు అపజయాలు, దు:ఖాలు భరించలేరు. తమ మనసులోని కోర్కెలు నిర్విఘ్నంగా తీర్చుకోవాలని రాజులు కలలు కంటారు. భరతుడికి సేవలు చేస్తూ ఉండమని నా తల్లితో చెప్పు. చిన్నవాడనే నిర్లక్ష్యం కూడదు. రాజుని పూజించడానికి వయసుతో నిమిత్తం లేదు. సిరిసంపదల వల్లనే రాజు అందరికన్నా అధికుడు, పూజ్యుడూ అవుతాడు.
చిత్రకూటంలో లక్ష్మణుడితో రాముడు: నేనసలు రాజ్యం ఎందుకు చేయాలనుకుంటున్నానో తెలుసా? నా తమ్ములందరూ సిరి సంపదలతో, రాజ భోగాలతో, సర్వ సౌఖ్యాలతో ఎల్లకాలం తుల తూగాలని" . 
ఈ రకంగా రాముడు తన కోర్కెలు తీర్చుకోవడానికి, తన బంధు మిత్రుల్ని సుఖపెట్టడానికీ, తనకు విధేయంగా లేని ప్రజల అంతు తేల్చడానికి రాజ్యం చేయాలనుకున్నాడన్నమాట. ఇలా పరిపాలించే రాముడి రాజ్యమేనా ప్రజలు కలలుగనే "రామరాజ్యం"?
  
రంగనాయకమ్మ హైందవ మతం మీద దాడి చేయడానికి ఎంత నికృష్టమైన లాజిక్కులు చెప్పిందో ఈ పేరా చూస్తే తెలుస్తుంది. ఈ మొత్తం పేరాలో రాముడు తనకోర్కెలు ఎక్కడ తీర్చుకున్నాడో ఎవరైనా చెబుతారా?? తన తమ్ములు సుఖంగా ఉండాలని కోరుకోవడం కూడా తప్పేనా? మనం ప్రేమించే ప్రతీ వ్యక్తీ సుఖంగా ఉండాలనే ఆకాంక్షిస్తాం. అందులో కూడా స్వార్థమనే కోణాన్ని చూడటం కేవలం కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యం కాబోలు. తనకు విధేయంగా లేని ప్రజల అంతు చూడటానికి రాజ్యం చేయాలనుకున్నాడని రంగనాయకమ్మ ఆరోపించింది. పైన పేరాలో ప్రజల ప్రస్తావన ఎక్కడ వచ్చిందో కొంచెం చెబుతారా?? ఆవు వ్యాసం టైపులో ప్రతీ పేజీలో కనీసం రెండు సార్లు రాముడు ఇలా తప్పు చేశాడు, ప్రజలు కష్టాలు పడ్డారు అని అరిగిపొయిన రికార్డ్ తప్ప మరొకటి కాదు. రాముడు ప్రస్తుతకాలానికి చెందనివాడు కాబట్టి ఏమైనా ఆరోపించచ్చు. ఎవరైనా ఎదురు చెబితే వాళ్ళను "చాంధసులు" అని ముద్రవేసి హేళన చేయవచ్చు. మాటిమాటికీ ప్రజలు ప్రజలు అని ముసలి కన్నీరు కారుస్తూ ఎంచక్కా పుస్తకాలు అమ్ముకోవచ్చు. రంగనాయకమ్మ తన స్వార్థం కోసం, కేవలం తన స్వార్థం కోసం ఒక మతం గురించి ఎంతటి విషప్రచారం సాగించిందో చూడండి. మొత్తంగా చూస్తే రంగనాయకమ్మ మార్కెటింగ్ స్ట్రాటెజీ నుంచీ ప్రతీ ఒక్క మార్కెటింగ్ మేనేజర్ నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. 

సర్వేజనా సుఖినోభవంతు,
-రామదండు 



26 comments:

రాజ్ కుమార్ said...

కికికికి... అంత క్లియర్ గా చెప్తుంటే.. అలా ఏకి పారేస్తారేంటి రామదండూ?? ;) ;)
ఈ బుక్ ఎలా హిట్టయ్యింది చెప్మా... ?? అని బుర్ర గోకింగ్స్...

బంతి said...

జాగ్రత్త గా గోక్కొ పుఱె కూడా మిగలదు మళ్ళీ

Unknown said...

రంగనాయకమ్మ దృష్టిలో రామాయణం ఒక కట్టు కథ. కట్టు కథలో రాముడు అనే పాత్ర తప్పు చేస్తే ప్రజలు కష్టాలు పడ్డమేందో...వీళ్ళూ వీళ్ళ పైత్యం. :-)

Anonymous said...

రంగనాయకమ్మ దృష్టిలో రామాయణం ఒక కట్టు కథ. కట్టు కథలో రాముడు అనే పాత్ర తప్పు చేస్తే ప్రజలు కష్టాలు పడ్డమేందో...వీళ్ళూ వీళ్ళ పైత్యం. :-)...............

Because, they follow it like the "Gorrela manda"" and so do the same mistakes!

Malakpet Rowdy said...

తమ మనసులోని కోర్కెలు నిర్విఘ్నంగా తీర్చుకోవాలని రాజులు కలలు కంటారు.

సిరిసంపదల వల్లనే రాజు అందరికన్నా అధికుడు, పూజ్యుడూ అవుతాడు.
__________________________________________________

Where are these lines written, I mean what verses exactly?

Alapati Ramesh Babu said...

అమె చాలా కన్వినెంట్ గా తనకు వీలున్న శ్లోకాలను తీసుకోని.ఆశ్లోకం ముందు వెనుకలు విస్మరించి దిక్కుమాలిన వ్యాఖ్యన సహిత దుర్మార్గ జాతిహననము,జాతిపురుషుడి వ్యక్తిత్వహనననము చేసి మొత్తము జాతి పై దాడిని నిస్సిగ్గుగా చేసి అదె చాలా పెద్ద మెధావితనమని విర్ర వీగుతుంటది. కథలలొ ముసలి మాంత్రకత్తె అని చదువుతాము ఇటువంటి వారె శూర్పణఖలు,తాటకిలు అందుకే విశ్వామిత్రుడు తాటకిని చంపిస్తే,రాముడు దయతలచి శూర్పణఖను విడచితే అమె తనజాతికి,తన సోదరుడు మరియు రాజు అయిన రావణునికి మరియు రామునికి ముప్పుగా పరిగణించినది.అందుకే ఇంత దుష్ట ప్రవృత్తిగల వారిని స్త్రీ అని ఉపెక్షించరాదు అని విశ్వామిత్రుడు చెప్పాడు. మీరు ఇంకా కొత్తగా బలంగా అచరించండి.అమె మారిచుడికి జన్మనిచ్చిన తాటకి బొలేడు మాయలు వుంటాయి.పూతను ను కృష్ణుడు హరించినట్లు ఈమెని చేధించండి.

Subrahmanya Sarma said...

బాగా రాస్తున్నారు..
"విషవృక్షం"లాంటి తీవ్రమైనపేర్లు పెట్టుకుని తిట్టినప్పుడు, వ్యక్తిగత విమర్శలు చేయకుండా, సయమనం పాటించడం చాలా కష్టం. అట్టాంటిది, మీరు ఎంతో ఓపికగా, సంయమనంతో దానిని తెగనాడుతూ వస్తున్నారు. ఇలాగే మరిన్ని టపాలు రాస్తారని ఆశిస్తున్నాను.

Anonymous said...

రంగనాయకమ్మ ఎప్పుడూ వితండవాదం చేయలేదు. కేవలం విషయాన్ని తార్కికంగానూ, సహేతుకంగానూ విమర్సిస్తూ రాస్తుంది అని చెప్పుకుంటూ ఉంటారు ఆమె వీరాభిమానులు.

ఆవిడ తార్కికత, సహేతుకత ఇదన్న మాట.. :-)

ఆత్రేయ said...

దా.. బొం..
ఆ మూర్ఖిజానికి ఎందుకంత విలువిచ్చి చర్చిస్తునారు.?
ఆ పని చెయ్యటానికి కొన్ని ఖాళీ జీవులున్నయిగా ..
తీసి పడేయండి.

Anonymous said...

/ఆ మూర్ఖిజానికి ఎందుకంత విలువిచ్చి చర్చిస్తునారు.?/
:)) వేల ఏళ్ళ క్రితం రాయబడిన కథని, 25ఏళ్ళ క్రితం మూర్ఖిస్టు కోణంలో చూచిన ఓ మూర్ఖురాలి తలతిక్క వాదనలను, స్టేజి మీదకు తెచ్చి మరో ముద్రణ వేయించుకునేందుకు ఇలాంటి విమర్శలు వుపయోగపడతాయి.

Anonymous said...

విషవృక్షం పుస్తకం పేరు చాన్నాల్ల నుండి వింటున్నా గానీ.. దాని మీద ఇలా ఓ ప్రత్యేక బ్లాగే నడుస్తుందంటే.. అసలు దానిలో ఏముందో చదవాలనే కోరిక పెరిగిపోతుంది. అర్జెంటుగా వెల్లి ఆ బుక్ కొంటాను..Thanks.

రామదండు said...

రాజ్ కుమార్ గారూ,
ఈ బుక్ హిట్ అవడానికి గల కారణాలు ముందు టపాలో వివరించాను(రామాయణమే ఎందుకు?). గమనించగలరు. రంగనాయకమ్మనే కాదు ఇంకెవరు ఏం రాసినా కొద్దో గొప్పో అమ్మకాలు జరిగేవి ఎందుకంటే మన సమాజం లో రాముడి పాపులారిటీ అలాంటిది.

రామలింగడు గారూ,
దీనికే పైత్యమంటే ఎలా? ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి.. వీళ్ళ పైయాలన్నీ చెప్పుకుని నిస్సిగ్గుగా హేతువాదం, తర్కజ్ఞానం అని చెప్పుకోవడం వీళ్ళకే చెల్లింది.

- రామదండు

Bhardwaj Velamakanni said...

అసలు దానిలో ఏముందో చదవాలనే కోరిక పెరిగిపోతుంది. అర్జెంటుగా వెల్లి ఆ బుక్ కొంటాను..Thanks.
______________________________________________________

I think a free download is available somewhere or else we may ask Ramadandu to upload it, so that people can read it free.

Illegal? Heck Yeah ;)

రామదండు said...

మలక్ పేట్ రౌడీ గారూ,

రంగనాయకమ్మ వాల్మీకి రామాయణం అని చెప్పుకుంది తప్ప పబ్లిషర్ ఎవరు, ఎన్నో పేజీలో ఫలానా విషయం రాశారు లాంటివి ఎక్కడా ఇవ్వలేదు. నేను వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రాసిన కొన్ని పుస్తకాలు చదివాను. వాటిలో శ్రీనివాస శిరోమణి గారు రాసిన "రామాయణం"లో రంగనాయకమ్మ ప్రస్తావించిన పంక్తులు కనిపించాయి. ఆ రామాయణం 1950లలో ఆంధ్రపత్రికలో సీరియల్ గా వచ్చేది. అటు తర్వాత 1956-1986 మధ్యలో ఎనిమిది సార్లు పున:ముద్రణ పొందింది. ప్రస్తుతం నా దగ్గర ఉన్న ప్రతి 1986లో ముద్రితమైనది. పాత పుస్తకం అవడం వల్ల నా దగ్గర కొన్ని పేజీలు లేవు.

రమేష్ బాబు గారూ,
రాముడిని తిట్టి అది గొప్పగా చెప్పుకోవడం రంగనాయకమ్మ ప్రవృత్తి కావచ్చు. కానీ ఆ కారణంతో ఆమెను వ్యక్తిగతంగా దూషించడం సంస్కారం కాదు కదా.. ఒకసారి శంకరాచార్యుల వారు నదిలో కొట్టుకుపోతున్న ఒకానొక వృశ్చికాన్ని రక్షించడానికి ప్రయత్నించారట. ఆయన దాన్ని చేతిలోకి తీసుకున్న ప్రతీ సారీ ఆ కీటకం ఆయనను కుట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అది చూసిన శిష్యబృందం ఆయనను దాన్ని రక్షించవద్దని వారించారు. కానీ శంకరులవారు "ఆ విషకీటకం తన నైజాన్ని వదలనప్పుడు, భూతదయ అనే నా నైజాన్ని నేనెందుకు వదలాలి" అని ప్రశ్నించారట.
గురుదేవులు చూపిన ఆ బాటలోనే నడవాలని రామదండు కృతనిశ్చయం. అందుకే రంగనాయకమ్మ వ్యక్తిగత విషయాలు తేకుండా టపాలు రాస్తున్నాం.

-రామదండు

రామదండు said...

సాలగ్రామ సుబ్రహ్మణ్యం గారూ,
మీరు చెప్పినట్టు ఇలాంటి విషయాలు చదివి సం యమనం తో రాయడం కొంత కష్టమైనపనే. కానీ మీలాంటి వారి అభిమానం, దేవుడి దయతో మేము ఈ పని చేయగలమనే భావిస్తున్నాం.

మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞులం.


ఆకాశరామన్న గారు,
సహేతుక విమర్శ అనే పదాన్ని సమయానికి గుర్తు చేసారు.. ఆ విషయం గురించి ముందు ముందు టపాలలో చూద్దాం. హేతువు అనే పదాన్ని ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించచ్చో అన్ని రకాలుగా భ్రష్టు పట్టించరు.

-రామదండు

రామదండు said...

ఆత్రేయ గారూ,
మనం విలువిచ్చి చర్చించడం లేదండీ.. ఆ పుస్తకం విలువ, ఆ వ్యక్తుల స్థాయి నలుగురికీ చెప్పేందుకు ఈ బ్లాగు తెరిచి రాస్తున్నాం.

SNKR గారూ,
బాగా చెప్పారు.

-రామదండు

రామదండు said...

>>we may ask Ramadandu to upload it, so that people can read it free.

Right now we have a road block to upload it. Hopefully we can resolve it sooner than later.

- రామదండు

Anonymous said...

stealing??? even it is from her, is punishable!!if the same stuff you are guarding, ever tell you anything, that is ""Don't Steal""!!

why can't you buy it if you are so......... interested?? even negatively???

no, for you, preaching is different from doing! and you will steal!! go on!!! do it and prove it!

Malakpet Rowdy said...

Anon,

I am still asking you the same question - Do you understand what has been written in the post?
and

Yes Illegal copy .. Heck yeah!

Malakpet Rowdy said...

Newayz since you don't have enough capability understand what I write ..

lemme ask you this question ..

Point out where I said one should not pirate books and the context. We can talk then :))

Anonymous said...

Anonymous Alias Tara
Shut up and stop being so boring. We have bought our copy from Kinige and you may verify with them. In your attempt to prove yourself smart you are proving again and again what kind of an ignorant guy you are and in the process you are also proving what your Goddess Ranganayakamma is.

Malakpet Rowdy said...

His Goddess Ranganayakamma :)))))))))

Thats correct though. Poor guy!

Anonymous said...

Does this guy even understand what you wrote Malak?

Malakpet Rowdy said...

What makes you think he does? :))

He doesnt understand what has been written in the post - not in the comments either. But he does add a great entertainment value.

Anonymous said...

/why can't you buy it if you are so......... interested?? even negatively??? /

As per socialist principle, people can grab whatever they want. We do sometimes respect your Marxist sentiments, though most of the time they are stupid. arE ... kyaa karE ... majboori hain! Kishore/Tara/Prabhakar saab! :))

Bhardwaj Velamakanni said...

SNKR :)))))