ఉద్దేశ్యం

ఈ బ్లాగు యొక్క ఉద్దేశ్యం విషవృక్షం పుస్తకాన్ని సమీక్షించి ఆ పుస్తకం రచయిత్రి రామాయణం గురించి చేసిన కువిమర్శలు/విషప్రచారాలను బయట పెట్టడం. ఇందులో రచయిత్రి వ్యక్తిగత విషయాలు గానీ, అసభ్య పదజాలం గాని ఉండదు. ఒక వేళ ఎవరి వ్యక్తిగత విషయాలైనా చర్చకువస్తే అది ఏదో ఒక విషయాన్ని స్పష్టం చేయడానికే తప్ప అవమానించడానికి మాత్రం కాదు. గమనించగలరు!

Wednesday, 20 June 2012

రంగనాయకమ్మ పైశాచిక ఆనందం..

కొన్ని నవ్వించే విషయాలు అనే శీర్షిక క్రింద రంగనాయకమ్మ రాసిన విషయాలు చూద్దాం..


దశరథుడు కైక కోరిన వరాలకు అదిరిపడి "భర్త ముద్దుగా వరాలు కోరుకోమంటే మాత్రం చక్కగా భర్తకు సంతోషం కలిగించే వరాలు కోరుకోవాలి గానీ భర్తకు నష్టం కలిగించే వరాలు కోరుకోవచ్చునా?" అని విసుక్కున్నాడు. చక్కగా భార్యలు చీరలో, నగలో కోరుకుంటే దశరథ మహారాజు గారు వాటిని తక్షణం తెప్పించి ఇచ్చి తమ కీర్తికాంతులు నలుదిశలా వెదజల్లేవారే, అంత కీర్తి తప్పిపోయినందుకు మహరాజు భార్య మీద మండిపడ్డాడు "దుష్టురాలా! నీ వరాల్ల నేను రాముణ్ణి అడవికి పంపితే ఆ దు:ఖంతో నేను చచ్చిపోతాను. నా కోసం రాముడు చచ్చిపోతాడు, లక్ష్మణుడు చచ్చిపోతాడు. భరతుడు చచ్చిపోతాడు. శతృఘ్నుడు చచ్చిపోతాడు రాణులందరూ చచ్చిపోతారు" అంటూ తనతోపాటూ చచ్చిపోయే వాళ్ళ పట్టీ చదువుతాడు. కానీ తమాషా ఏమంటే దశరథుడు చచ్చిపొయిన తర్వాత ఒక్కరన్నా చచ్చిపోలేదు. పైగా అయోధ్యలో సందడి ఇంకా ఎక్కువ అయ్యింది. "ముసలి రాజు పోయాడు పెద్ద కొడుకు అడవుల్లో ఉన్నాడు. భరతుడింకా రాలేదు. ఇప్పుడేం జరుగుతుందో" అనే ఉత్సాహంతో జనం ఎక్కడికక్కడ కబుర్లలో మునిగి ఉన్నారు.
తమపిల్లలు తమని ప్రేమిస్తారని ప్రతీ తండ్రీ అనుకుంటాడు. దశరథ మహారాజు కూడా అలానే అనుకున్నాడు.  అందుకు ఆయన మీద జోకులు!! ఏం చేస్తాం మన ప్రారబ్దం!! పైన వాక్యం లో కవి దశరథుడికి తన కుమారులతో  ఉన్న అనుబంధాన్ని వివరించడం సుస్పష్టం. దానిలోని ఒక వాక్యాన్ని బయటకు తీసి రంగనాయకమ్మ తమాషా అనడం అమె పైశాచిక ప్రవృత్తికి నిదర్శనం. తండ్రిలేని జీవితం మనిషికి అంధకారం లాంటిదని పెద్దలు చెబుతారు. అంటే దాని అర్థం ప్రపంచంలోని తండ్రులందరూ తలపైన దీపాలు పెట్టుకుని తిరుగుతున్నారని కాదు.  ఇక జనం ఉత్సాహంతో ఎక్కడికక్కడ కబుర్లలో మునిగి ఉన్నారు అని చెప్పడం సత్యదూరం. భరతుడు రాజ్యంలోకి వచ్చేదారిలో దు:ఖమయమైన నగరాన్ని చూసి ఆందోళన చెందాడని వాల్మీకి మహర్షి రాశారు. తనకు అనుకూలంగా లేదని కాబోలు రంగనాయకమ్మ ఆ ఊసే ఎత్తలేదు. అనుబంధాలని పరిహసించే రంగనాయకమ్మ స్త్రీల గురించి అమ్మల గురించి పుంఖానుపుంఖాలుగా రాయడం తెలుగు జాతికి పట్టిన దౌర్భాగ్యం. 


మరొకటి..
తనను, సారథిని, గుఱ్ఱాలనూ రక్షిస్తూ 11వేలమంది శతృవీరుల్తో వొక్కసారిగా యుద్ధంచేసి జయిస్తాడని రుషులు రాముడిని పొగుడుతారు. అలాంటి రాముడు గంగదాటి అడవిలోకాలు మోపగానే "లక్ష్మణా! నువ్వు రాకపోతే సీతని రక్షించడం చాలా కష్టమైపొయేది. మీరిద్దరూ ముందు నడవండి. నేను వెనుక నడుస్తాను. మిమ్మల్ని వెనుక నుంచీ రక్షిస్తాను" అంటాడు. అడవుల్లో రక్షించవలసినవాళ్ళు వెనుక నడవాలా, ముందు నడవాలా?? 
అడవిలో ముందు నుంచీ మాత్రమే ప్రమాదాలొస్తాయనే రంగనాయకమ్మ తెలివికి లాల్ సలాం! అసలు ఇలాంటి తింగర లాజిక్కులు ఇంకెవరూ చెప్పలేరేమో.. ఒకసారి రంగనాయకమ్మ చేత ఏ తలకోన అడవిలోనో పాదయాత్ర చేయిస్తే అప్పుడు తెలుస్తుంది ప్రమాదాలు ఏ వైపు నుంచీ వస్తాయో. ముందు టపాలో చెప్పినట్టు ఎలాగైన రాముణ్ణి కించపరచాలనే ఆకాంక్ష రంగనాయకమ్మలో బలంగా ఉంది. అందుకే ఇంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా అర్థం పర్థం లేని వాదనలు చేయగలిగింది.


ఇంకొకటి..
రాముడు, సీతా, లక్ష్మణుడూ వనవాసంలో అత్రి మహాముని ఆశ్రమానికి వెళతారు. అత్రి భార్య అనసూయ మహ పతీవ్రత. వృద్ధురాలు. నెరసిన జుట్టు వొణికే శరీరం. ఆమె సీతకు పూలదండా, అంగరాగాలు ఇస్తుంది. "నా దగ్గర తపస్సు చాలా మిగిలి ఉంది. నా తపోశక్తితో నీకి బహుమానాలిస్తున్నాను. నిత్యం ఈ పూలదండ ధరిస్తే నువ్వు నిత్య యవ్వనవతిగా ఉంటావు. ఈ అంగరాగాలతో నీ సౌందర్యం ఇనుమడిస్తుంది. ఇవి ధరిస్తే యవ్వనంతో నీ భర్తకి సంతోషం కలిగిస్తావు" అంటుంది. మరి తన మాట??తనెందుకు వాటిని ధరించి నిత్యయవ్వనవతిగా ఉండలేదు?అత్రి మహాముని గారికి ఆ ముగ్గుబుట్ట తలే ఇష్టం కావున్ను!!
తన తపోశక్తితో అనసూయ సీతకు బహుమతి ఇస్తే మధ్య రంగనాయకమ్మకు బాధ ఎందుకో?? అలాంటి బహుమతులు తనకు ఎవరూ ఇవ్వలేదనా?? లేక ఎలాగైన విమర్శించాలనే తపనా? మరొక విషయం- మనశక్తిని వేరేవాళ్ళకోసం ఉపయోగించడం మనకు వాళ్ళ మీద ఉన్న అనురాగాన్ని ఆప్యాయతని చెబుతుంది. ప్రతీ ఒక్కటి తనకు మాత్రమే కావాలనుకునే స్వార్థపు ఆలోచనలు అనసూయకు లేకపోవడం రంగనాయకమ్మకు కోపం తెప్పించాయి కాబోలు. ప్రపంచంలో అందరూ తనకు నచ్చినట్టే ఉండాలనుకునే వ్యక్తికి నిస్వార్థమైన ఆలోచనలు తమాషా అవడం అతి సహజం.
ఇవన్నీ పక్కన పెడితే ముగ్గుబుట్ట తల అని ముసలివాళ్ళను కించపరచడం రంగనాయకమ్మ కండకావరాన్ని సూచిస్తుంది. వార్థక్యం అనేది ప్రతీ మనిషికి సహజమైన దశ. దాని గురించి ఇంత నీచంగా మాట్లాడటం వ్యక్తిలోని పైశాచిక ప్రవృత్తిని బయటపెడుతుంది. మరి రంగనాయకమ్మకు రాలేదా ముసలితనం?? ఇలాంటి వ్యక్తిని ప్రజలు స్త్రీవాదిని అని, మరొకటని పొగుడుతుంటే వాళ్ళ అజ్ఞానానికి జాలిపడటం తప్ప ఇంకేమీ చెయ్యలేను.. 

సర్వేజనా సుఖినోభంతు
-రామదండు.
10 comments:

పంతుల జోగారావు said...

ఏప్రియల్ 2012 సంచిక పాలపిట్ట మాస పత్రికలో రామాయణ విష వృక్షంలో రాని కొత్త వ్యాసాల్లోంచి అని
రంగనాయకమ్మ రాసిన రాముడు ఏక పత్నీ వ్రతుడే ! కానీ, అది ఎందుకో తెలుసా ? అనే వ్యాసం ప్రచురించ బడింది.
అందులో లోకం నిండా ఉన్న పరమ మూర్ఖులకు తెలియని కొన్ని విషయాలు ప్రస్తావించేరు.
రాముడికి పది మంది భార్యలు ఉంటే, కనీసం నలుగురు భార్యలు ఉన్నా, కథ చాలా అడ్డాలు తిరుగుతుంది అలాగయితే అంత మంది తోనూ అడవులకు పోవాలి. ఒక్క దానితో వెళ్తేనే ఎన్ని పుర్రాకులు పడ్డాడో తెలిసినదే కదా.
ఇక, కుశ లవులు ఒక్క సీత కనుక ముని ఆశ్రమంలో పుట్టారు. అదే పది మందయితే ఎంత మంది పుట్టాలో కదా ?
అంతే కాదు, ఒక్క సీత కనుక రావణుడు ఎంచక్కా ఎత్తుకు పోగలిగేడు. అదే పది మందయితేనో ?

ఇలాంటి చాలా చిక్కు ప్రశ్నలు సంధించి వదిలారు.

ముదిమి వయసులో మార్సిజమ్ మతి పోగొడుతుంది కాబోలు . కదండీ ?

RaPaLa said...

రంగనాయకమ్మ విషవృక్షం పెద్ద సూపర్ ఏమి కాదు, రాసి ౩౦ ఏళ్ళు దాటింది, ఇప్పుడు విమర్శించి కొత్త పబ్లిసిటి ఇవ్వడమెందుకు.

SNKR said...

/ఇలాంటి చాలా చిక్కు ప్రశ్నలు సంధించి వదిలారు/

అవి చిక్కుప్రశ్నలేమిటండి? చిల్లర చెత్త ప్రశ్నలైతేను. ఇలాంటి చెత్త విమర్శలతో మార్కిజం పై కొద్దిగా ఆసక్తి వున్న వాళ్ళకి కూడా మొదటి పరిచయమే వెగటు కలిగించి అసహ్యం పుట్టేలా చేస్తుంది. రంగమ్మ తన 'తక్కువ రకం' బుద్ధి చాటుకుంది.

ఇపుడు ఈవిడ ఫోటో చూడండి, తల ముగ్గుబుట్ట, పైగా నల్ల కరుణానిధి కళ్ళజోడు, దానికితోడు టాంబాయ్ హేర్‌స్టైల్.

/ఇప్పుడు విమర్శించి కొత్త పబ్లిసిటి ఇవ్వడమెందుకు/
Well said, I agree.

రామదండు said...

పంతుల జోగారావు గారూ,
అలాంటి తిక్క ప్రశ్నలు రంగనాయకమ్మ &కో మాత్రమే వేయగలరు. వాటిని కమ్యూనిష్టు ముఠా బ్రహ్మజ్ఞానమని నమ్ముతారు.
>>ముదిమి వయసులో మార్సిజమ్ మతి పోగొడుతుంది కాబోలు .
మతి అంటూ ఉంటే కదా పోవడానికి..

రపల గారూ,
రాసి 30ఏళ్ళయినా కమ్యూన్సిహ్టులు ఆ పుస్తకం ఒక తోపు గ్రంథమని ప్రచారం చేస్తున్నారు. రంగనాయకమ్మ నిజ స్వరూపాన్ని చూపించకపోతే ప్రజలు కమ్యూనిష్టు ప్రచారాన్ని నిజమనుకునే ప్రమాదం ఉంది. అందుకే ఆ పుస్తకంలోని ప్రతీ విషయాన్నీ కవర్ చేయ్యాలని ప్రయత్నిస్తున్నాం.

శంకర్ గారూ..
స్పందించినందుకు నెనర్లు.

- రామదండు.

Anonymous said...

వంకాయమ్మకి ప్రవీణే కాకుండా ఇంకొక అభిమాని ఉన్నాడని తెలిసింది. పైగా అతను అమేరికాలో నివసిస్తున్నాడు. ఆంధ్రజ్యోతి పేపర్ లో తెలకలపల్లి రవి ని విమర్శిస్తూ ఒక ఉత్తరం రాశాడు. ఆయన పేరేదో ప్రసాద్ అని వస్తుంది. ఆ ఉత్తరం చదివి ఆశ్చర్యపోయాను. ఆమేకి కూడా అమేరికాలో అభిమానులు ఉన్నారంటే, వారు ఇంకా ఎర్రపార్టి నిర్మాణం గురించి, 45+ సం|| ల ముదిమి వయసులో మాట్లాడుతున్నారంటే , మర్క్స్ గారిని మనసులో అభినందించవలసి వచ్చింది. ఐదు నక్షత్రాల హోటల్లో 10,000 రూపాయలకు తాగిన రాత్రి తాగిన మందు మత్తు తెల్లారే సరికి దిగిపోతుంది. అదే 30సం|| క్రితం, మార్క్స్ గారు రాసిన 30రూపాయల పుస్తకం చదివిన వారికి, ఎక్కిన కమ్యునిజం కిక్కు అమేరికాకి వేళ్లినా అతనిలాంటి కొంతమందికి ఇంకా దిగలేదు అంటె ఆలోచించదగ్గ విషయమే.

SriRam

Anonymous said...

JUBV Prasad. Superfan of Rangi.

Anonymous said...

avunu. nenu kuda chadivaanu.
evaro prasad ani.
my god. I surprised at his reaction against Ravi who criticized Ranganayakamma's writings. Just came to know that he is living in USA, if it is so, then it will be most funniest thing. Living in USA and supporting Marxism. Generally Marxists are against USA and its alliances.

హై హై నాయకా said...

ఈ మార్క్సిస్టులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ఆ ప్రసాద్ ని చూస్తె తెలియటం లేదూ. వీళ్ళ సిద్ధాంతాలన్నీ మాటల వరకే. చేతల్లో కాదు. పిచ్చినా ............గాళ్ళు.

Anonymous said...

Who is that new joker other than Vishekar and Marthanda? links plz

Anonymous said...

Ranganayakamma and Team ki Bharata desam lo bratike arhatata ledu veelu peda purugulai pudataru......rama namam,Ramudi gurinchi palike arhata leni kukkalu(papam Kukkalu Nannu Tidatayi)