ఉద్దేశ్యం

ఈ బ్లాగు యొక్క ఉద్దేశ్యం విషవృక్షం పుస్తకాన్ని సమీక్షించి ఆ పుస్తకం రచయిత్రి రామాయణం గురించి చేసిన కువిమర్శలు/విషప్రచారాలను బయట పెట్టడం. ఇందులో రచయిత్రి వ్యక్తిగత విషయాలు గానీ, అసభ్య పదజాలం గాని ఉండదు. ఒక వేళ ఎవరి వ్యక్తిగత విషయాలైనా చర్చకువస్తే అది ఏదో ఒక విషయాన్ని స్పష్టం చేయడానికే తప్ప అవమానించడానికి మాత్రం కాదు. గమనించగలరు!

Sunday 3 June 2012

పీఠిక లోనే మొదలైన పీడ: రామదూషణ

పీఠిక లో రామదూషణ చాలానే  జరిగింది. దూషణ అని ఎందుకన్నానంటే ఇది విమర్శ  స్థాయి దాటి చాలా దూరం వెళ్ళింది. ఉదాహరణకు క్రింది వాక్యాలు చదవండి:
రాముడికి నిజంగా ఉన్న లక్షణాలు:
౧.లోకాన్ని మోసపుచ్చే అబద్దపు వ్రతాలు
౨.ఎప్పుడూ ఎదుటివాడికి నీతులు బోధిస్తూ ఉండటం
౩.కపట గాంభిర్యం
౪. రెండు నాలికల మాటలు
౫.తనే జ్ఞానిననే అజ్ఞానం
౬.తనకు సేవలు చేసే ఆప్తులని శంకించి అవమానించడం
౭.నిస్సహాయులని ఘోరాతి ఘోరంగా హింసిచడం


ఈ లక్షణాలన్నీ రాముడిలో ఉన్నాయని రంగనాయకమ్మ రాసింది. అందుకు ఆమె ఇచ్చిన కారణాలు విషవృక్షం లోపలి పేజీలలో ఉందని ఆశిద్దాం (అవి ఎంతమాత్రం లాజికల్ అనేది తరువాత సమస్య). కనుక ఈ పుస్తకం లోపలిపేజీలలోకి వెళ్ళేముందు ఈ లక్షణాలకు సంబంధించిన జస్టిఫికేషన్ కోసం చూడాలి. సరే, ఆ విషయం పక్కన పెడితే  ఈ లక్షణాలన్ని రాముడికి నిజంగా ఉన్నాయని అనడం కంటే  తనకు రాముడిలో కనిపించిన విషయాలు అని రంగనాయకమ్మ  రాసుంటే బాగుండేది. ప్రతీచోటా ఇలాంటి జెనరలైజ్ చేస్తూ రాయడం రంగనాయకమ్మ శైలి అనుకుంటా..

ఇప్పుడు ఇంకొక విషయానికి వద్దాం:
అసలు పితృవాక్య పరిపాలన అనేది  ఒక బూటకపు ధర్మం. ఆ  ధర్మం పాటించడానికి నానా కష్టాలు పడాలంటే ఏ కొడుక్కి ఆత్మలోంచి నిజమైన సంతోషం రాదు. కానీ సమాజం లో అదే గొప్ప కీర్తి గా చెలామణి అవుతుంది కాబట్టి , దాన్ని సంతోషంగా పాటిస్తున్నట్టు పైకి నటన ! ఆత్మ వంచన! పరవంచన!కీర్తి కాంక్ష!గొప్ప ఆదర్శాన్ని పాటిస్తున్నామనే భ్రమ. కీర్తి కోసం వీపుమీద ఒక పర్వతం ఎత్తుకుంటే తిన్నగా నడవడం సాధ్యమేనా? - కాదు. అది ఎలా సాధ్యం కాదో బూటకపు సంఘనీతులు, గందరగోళపు ధర్మాలు పాటించవలసివస్తే ఏ వ్యక్తీ వీటికోసం స్వచ్చంగా, నిష్కల్మషంగా నిర్విచారంగా ప్రవర్తించడం సాధ్యం కాదు.

పితృవాక్య పరిపాలన అనేది రంగనాయకమ్మకు బూటకపు ధర్మమట.. ఎందుకు?? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే రామయణ కావ్యం  లో పితృవాక్య పరిపాలన అనేది చాలా ముఖ్యమైన విషయం. దాన్ని బూటకం అనడం ద్వారా రంగనాయకమ్మ రాముడు చేసిన మిగతా పనులను చులకన చేయడానికి ఒక చక్కని ప్లాట్ ఫారం ఏర్పాటు చేసుకుంది. బూటకం అని రాసింది కానీ ఎందుకు బూటకం అనేది చెప్పలేదు.. ఆత్మలోంచి నిజమైన సంతోషం రాదు. అని రాయడం నన్ను ఆశ్చర్య పరచింది. భౌతిక వాదినని చెప్పుకునే రంగనాయకమ్మ ఇలా ఆత్మలూ, దయ్యాలు అని మాట్లాడటం ఏమిటో??
పై వాక్యాన్ని మరో కోణం లో  ఆలోచిస్తే రాముడు చేసిన ఏ పనినైనా తిట్టాలనే తపన కనిపిస్తుంది. ఎందుకంటే మహిళ అయినరంగనాయకమ్మకు తల్లిదండ్రులకు ఏం చేస్తే కొడుకులు సంతోషపడతారో తెలిసే అవకాశమే లేదు. ఇక్కడ సమస్య రంగనాయకమ్మ మహిళ కావడం కాదు. ఆమెకు కుటుంబ విలువల పట్ల గౌరవం లేకపోవడం. ఇక రాముడు ఆత్మవంచన చేసుకున్నాడని నిందించడం. రాముడు ఆత్మవంచన చేసుకున్న విషయం ఈవిడ గారికి ఎలా తెలిసిందో ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు. ఇక గొప్ప ఆదర్శాలను పాటిస్తున్నామనే భ్రమ  అని రాసింది. ప్రతీ మనిషి తన ఆదర్శాలను గొప్పవనే నమ్ముతాడు లేకపోతే అ ఆదర్శాలు పాటించలేడు. మరి రాముడి ఆదర్శాల గురించి  ఇన్ని మాటలు మాట్లాడుతున్న రంగనాయకమ్మ కొన్ని  లక్షల మందిని పొట్టన పెట్టుకున్న మార్క్సిస్ట్ సిద్దాంతాలను మాత్రం గొప్పవని ఎలా చెబుతుంది?? ఇది ఆత్మ వంచన అవునో కాదో చెప్పలేను కానీ ఖచ్చితంగా పర వంచనే.. 

ఇక మరొక జోకు వీపు మీద పర్వతం. ఒక నియమం ఒక మనిషికి బరువుగా అనిపించవచ్చు. కానీ అది అందరికీ బరువు కావాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఉదయం ఆరు గంటలకు నిద్ర లేవడం అనేది మన సమాజం లో చాలామందికి బరువైన పని లా అనిపిస్తుంది కానీ కొందరికి చాలా సౌకర్యవంతంగా , ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఆ కాలం లో రాముడికి పితృవాక్య పరిపాలన అనేది కష్టం కాక పోయి ఉండవచ్చు. ఇక మరొక విషయం, రాముడు తన తండ్రికి ముద్దుల బిడ్డ అలాంటి రాముడికి బలంతంగా ఒక నియమాన్ని పాటించాల్సిన పని లేదు. రాముడిని ఆ నియమం పాటించమని ఎవరూ బలవంత పెట్టలేదు, కాబట్టి అదేదో ఆత్మవంచన అనుకోవడం రంగనాయకమ్మ  బుద్దిహీనతను సూచిస్తుంది తప్ప మరొకటి కాదు. కుటుంబ విలువల పట్ల గౌరవం లేని రంగనాయకమ్మకు పితృవాక్య పరిపాలన ఒక భారం లాగా అనిపించవచ్చు. కానీ అది ఇతరులకు అనిపించాల్సిన అవసరం లేదు. ఇలాంటి జెనరలైజేషన్లు ఈ పుస్తకం నిండా ఉన్నట్టుగా ఉన్నాయి.

ఇదే పీఠికలో మరొక చోట రంగనాయకమ్మ ఇలా రాసింది:
రాముడికి భరతుడి హక్కు సంగతి తెలియక పోవడం వల్లనే పట్టాభిషేకానికి సిద్దపడితే అది రాముడి తప్పు అవదు. కానీ, ఆ  విషయం తెలిసీ రాముడు పట్టాభిషేకానికి సిద్దపడ్డాడంటే అది రాముడి కపటం అవదూ?? 
ఒకసారి అడవిలో పులి జింకను తినడానికి వచ్చిందట. జింక " నేను నీకేమీ అపకారం చెయ్యలేదు. నన్నెందుకు తింటావ్?" అని అడిగింది. దానికి పులి " నదిలో నీళ్ళు తాగి నీళ్ళు ఎంగిలి చేశావ్ అని చెప్పిందట"
ఇలా ఉంది రంగనాయకమ్మ వైఖరి. ముందు రాముడు భరతుడి గురించి తెలిసి కూడా రాజ్యం అడగటం తప్పు అని చెప్పింది. పితృవాక్య పరిపాలన అనేది రాముడి నియమం అంటే, అది బూటకం అంటుంది. స్థూలంగా రాముడు ఏం చేసినా తప్పే(రంగనాయకమ్మ దృష్టిలో) దాన్ని ఏదో విధంగా జస్టిఫై చేసుకోవడానికి ఈ సర్కస్ వేషాలు.. ఈ ధోరణి కేవలం రాముడిపై ఆమెకున్న ద్వేషాన్ని ఎత్తి చూపుతుంది తప్ప మరొకటి కాదు.

తర్వాత పేరా:
కవి రాసే నీతులు అనేకం పరస్పర విరుద్దంగా ఉండటానికి కారణం ఆ నీతులను నిర్దేశించే సమాజం లో హేతువాదానికి, తర్క జ్ఞానికి స్థానం లేకపోవడమే.. సమాజం లో లేని తర్క జ్ఞానాన్ని కవి తన రచనలలో చూపించలేడు.ప్రకృతి విరుద్దమైన కల్పనలతో, కపటత్వాలతో , మర్మ గుణాలతో ఆత్మ వంచన చేసుకునే సమాజం లో కవీ వంచకుడే..

అప్పటి తర్కజ్ఞానం గురించి మాట్లాడుతున్న రంగనాయకమ్మ తర్క జ్ఞానమెంతనో త్వరలోచూద్దాం.Depression/violence తో నిండిపొయిన ప్రస్తుత సమాజం లో రంగనాయకమ్మ  ఏమౌతుంది?? డిప్రెషన్ పేషెంట్ ? లేక బ్లడ్ మాంగర్?? ఎవరి చాయిస్ వాళ్ళది. ఆఖరికి రామాయణాన్ని గ్రంథస్తం చేసిన వాల్మీకి మహర్షిని దూషించడానికి రంగనాయకమ్మ ఏ మాత్రం వెనకాడలేదు. ఆమెలోని ద్వేషాన్ని తెలియజేసేందుకు ఇంతకంటే పెద్ద సూచిక అవసరం లేదు. 


స్థూలంగా చూస్తే పీఠిక లోని ఈ సెక్షన్ లో కొన్ని విషయాలు స్పష్టం అవుతాయి:
౧. రాముడిని దూషించడం లో రంగనాయకమ్మ  చాలా ఆరితేరిన మనిషి. బహుశా అందులో ఆనందాన్ని పొందుతుంది కాబోలు.
౨. ప్రతీ విషయాన్నీ తనే ప్రధమం అనే కోణం లో ఆలోచించడం రంగనాయకమ్మ నైజం. దీన్నే ఇంగ్లీష్ లో Ego Centric Attitude అంటారు. 

సర్వేజనా సుఖినోభవంతు
-రామదండు  


32 comments:

నాగప్రసాద్ said...
This comment has been removed by the author.
Unknown said...

రామాయణ విషవృక్షాన్ని రాయడానికి అన్యమతస్తుల దగ్గర్నుండి కలర్ లీడరమ్మ ఎంత తీసుకుంది అనేదాని మీద సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నా... :-))

మనోహర్ చెనికల said...

బాగా చెప్పారు. మీరు రాసిన దాన్ని మెచ్చుకుంటే బాకా ఊదుతున్నాం అంటారు. రాముడిని ఆదర్శంగా తీసుకోవడం మేధావులపని కాదని వాళ్ళ నమ్మకం. కనీసం రాముడిలో ఏదో ఒకగుణం నచ్చి, మనం అనుకరిస్తున్నాం.ఈ గుంపు అంతా అల్లా ఒక రంగనాయకమ్మ పుస్తకం పట్టుకుని రాముడి మీద బురద చల్లడానికి బయలుదేరేవాళ్ళే. సగానికిపైగా అయితే నిజంగా రామాయణంలో ఏమ్ముందో తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. మా హైకమాండ్ నాయకమ్మ చెప్పిందే నిజం అంటారు. పోనీ అదే రామాయణం లోంచి ఉదాహరణలు చెప్పినా వినరు. మేమెందుకు వినాలి అంటారు. వాల్మీకి రాముడి పక్షం నుండి రాశాడు అని అంటారు. మరి అదే వాల్మీకి కవర్ చెయ్యాలనుకుంటే అసలు వాలి లాంటి పాత్రలు లేకుండానే రామాయణం రాయచ్చు. మన మేతావులకి ఇవన్నీ అవసరం లేదు. తెలియక అడిగేవాళ్ళకి చెప్పొచ్చు, మా వాదన మాదే అనే వాళ్ళకి ఏం చెప్తాం. కనీసం ఈ బ్లాగు ద్వారా అయినా కొంతమంది ఈ విషవృక్షం గురించి పునరాలోచిస్తారని కోరిక.

Bhardwaj Velamakanni said...

More than being ego-centric, its being a sadist :)

Anonymous said...

I have so many, for that matter, infinite ways of proving gravity's strength on the earth, but, just let us see, what proofs these guys "For Ramayana" can give us that it is a real life story???

why... you?? BHARADWAJ??? just get us one proof, it would be enough!! don't write anything else ""ANYTHING ELSE"" other than the proof!!!! try your level best!
real proofs, not assumed ones!!! OK?

we just need a proof that Ramayana was a true life thing! that's all!!

slightest deviation from it, you accepted your ignorance! come on! Let's have it!

Bhardwaj Velamakanni said...

Anonuymous,

Lets start with the basics first. Tell us what do you understand about this post first. Then we can start talking about it.

Bhardwaj Velamakanni said...

Sure, lets have it as you said first.

My contention is that your comment is not related to the post at all. So, help me understand what you understand about what has been written in the post. Got it?

Anonymous said...

10 headed species trying to marry 1 headed species, a flying man/monkey, on his own......all that maya's and mantra's???

just because they dont have any CC Cameras back then, doesn't mean, you could assume, imagine whatever you wish!
this planet has some laws physical and biological, whoever lives on it, must, must & should obey them!! even the god himself!!

mythology died in many countries long ago!!

Anonymous said...

Oh, Bharadwaj!! you started it again??? come on! get on with tit!

Bhardwaj Velamakanni said...

"10 headed species trying to marry 1 headed species, a flying man/monkey, on his own......all that maya's and mantra's???"

Is this what you think, has been written in the post?

Bhardwaj Velamakanni said...

I asked you a simple straight forward question -

WHAT HAS BEEN WRITTEN IN THIS POST?

Do you have an answer or not?

Anonymous said...

oops! he got angry!! but no Proofs, or whatsoever!!! hehe.

hate Ranganayakamma, come up with a Proof!!!

NOTHING ELSE! BHARADAJ!

why, by mistake, are you too with me, that ramayana is just a story, are you?? heck with you!!

no person or the statistics never confirmed that all the criminals are atheists!! so, we don't need doctrines!!

again, proof?? bharadwaj! just write about it!! you hate her, then give us the fact!! else??? hmmmm.......you can decide!!!

Oh, YEAH, I read the post!!! so, don't worry about me!! pls!
don't go to that petty details! you have a bigger task to accomplish!! the PROOF!

Anonymous said...

no petty details dear!!! come up with a PROOF!!!

we all know what this post is, and whom you are supporting!!! and why? too!! don't kid us, or manipulate with words!!!

I did mention it, ONLY PROOF, NOTHING ELSE!!!
can you, can't you???
the proof should be as strong as the gravity's value!!! OK???

don't waste your time writing crap, instead, search for a rock solid PROOF!!! heck, when did you answer straight, it was always through bezier curves!!!hehe

హై హై నాయకా said...

అన్యా అజ్ఞాతా ఇండో-లంక మధ్యనున్న రామసేతు ఎవరు కట్టారో నీ దగ్గర ప్రూఫ్ ఉంటె కాస్త చూపిస్తావా? పోనీ రంగనాయకమ్మని అడుగు. ఏదైనా ఆధారాలు చూపించమని అడుగు. సమాధానం తన దగ్గర ఉంటుందా?

హై హై నాయకా said...

అన్యా అజ్ఞాతా ఇండో-లంక మధ్యనున్న రామసేతు ఎవరు కట్టారో నీ దగ్గర ప్రూఫ్ ఉంటె కాస్త చూపిస్తావా? పోనీ రంగనాయకమ్మని అడుగు. ఏదైనా ఆధారాలు చూపించమని అడుగు. సమాధానం తన దగ్గర ఉంటుందా?

Anonymous said...

dear anon who's your father? can you prove your answer?

I did mention it, ONLY PROOF, NOTHING ELSE!!!
can you, can't you???
the proof should be as strong as the gravity's value!!! OK???

don't waste your time writing crap, instead, search for a rock solid PROOF!!! heck, when did you answer straight, it was always through bezier curves!!!hehe

Bhardwaj Velamakanni said...

Anon

I am again asking you the same simple straight forward question

DO You understand what has been written in the post?

Bhardwaj Velamakanni said...

Hai hai Naika

Wait. Let this guy answer the question. Looks like he doesnt understand what the post is all about :)

Bhardwaj Velamakanni said...

By the way let me explain-

The question is not anout whether you read the post. It is about whether you have understood it or not. :)

Anonymous said...

ఈపోస్టు రామాయణ విషవృక్షం మీద అయితే రామాయణానికి ప్రూఫ్ అడగడమేమిటి? పోనీ రామాయణం సింపులుగా ఒక కథ అనుకుందాం? ఆ విషవృక్షం ఆ కథ మీద వచ్చిన సమీక్ష అనుకుందాం. ఆ సమీక్ష అడ్డ్గోలుగా ఉంది ఇక్కడా రాస్తుంటే.. మధ్యలో రామాయణానికి ప్రూఫెందుకు?

సరే ప్రూఫుల గురించి మాట్లాడుకుంటే.. మార్క్సిజాన్ని ప్రచారం చేసుకోవడానికే + (మరికొన్ని కారణాల వలన) కదా రామాయణ విషవృక్షం రాయబడింది.. మరి మార్క్సిజం సైన్సు అని ప్రూవు చేయగలరా? అసలు మార్క్సిజం సైన్సనే వారికి సనిన్సు అని దేన్ని అంటారో, దానికుండాల్సిన లక్షణాలు ఏమిటో తెలుసా? మరి ఊహాగాణాలతో నిండిన మార్క్సిజపు సిద్దాంతాన్ని పట్టుకుని, దాని ఆధారంగా రామాయణాన్ని తిరగరాయడమేమిటి?

ఇదంతా ఒక మతం వారు, మరో మతం వారితో మా దేవుడే గొప్ప. మా దేవుడ్ని ఫాలో అయ్యిన వాల్లు మాత్రమే స్వర్గానికి వెలతారు. మీరంతా నరకానికి పోతారు అన్నట్లుగా లేదు..?

Bhardwaj Velamakanni said...

Akasaramanna

Lets see if we get the answer.

Bhardwaj Velamakanni said...

ఈపోస్టు రామాయణ విషవృక్షం మీద అయితే రామాయణానికి ప్రూఫ్ అడగడమేమిటి?
__________________________________________________

Thats how the atheists think :)) The problem is ... this chap doesn't understand the post.

Anonymous said...

రామదండు
రంగనాయకమ్మ అభిమానులకు మీ పోస్టులు పిచ్చెంకించాయని అర్థమవుతున్నాది. పైనున్న అనానిమస్ పోస్టుకు సంబంధంలేని కామెంట్లే దానికి నిరూపణ. మరో ప్రవీణ్ శర్మ బ్లాగ్లోకంలో ఉదయించాడు.

Anonymous said...

Malak, Easy - you are mistaken about that cranky Anon ;) :)) :)))
------
Anon,
I agree with your scientific blabberings & crazy research!

Snkr :D

Bhardwaj Velamakanni said...

Snkr,

Nope! I am not mistaken. Its the same one - the great researcher. No one else posts such intelligent comments :))

He still has not said what he understood :))

Jai Gottimukkala said...

Anonymous said...

"what proofs these guys "For Ramayana" can give us that it is a real life story???"

Ranganayakamma discussed and answered the question herself. She is targeting the image that Hindus have on Rama and asserts that the historical nature of Ramayana is irrelevant to the subject.

Bhardwaj Velamakanni said...

historical nature of Ramayana is irrelevant to the subject.
_____________________________________________________

Exactly. The whole discussion is about what Ranganayakamma wrote and how she wrote it. Hope this guy gets it at least this time (Though I am hoping against the hope) :P

Jai Gottimukkala said...

@Bhardwaj Velamakanni:

Whether Ramayana is fact or fiction is not only irrelevant but the author herself came to the same conclusion.

Bhardwaj Velamakanni said...

Jai I agree that she concluded it was a fiction. But then, when she considered it a fiction then she should have treated Rama as a character, not as a person, through out the book. Did she?




PS: I was only passing time with that guy who wouldnt understand what the post was about. He never makes any sense with any of his comments anywhere. So, you dont want to take it seriously.

Bhardwaj Velamakanni said...

Its like this ...

1. Ranganayakamma throws some insults on the book Ramayana.

(By the way I think she never read the original version of Ramayana. She only read a translated version)

2. Ramadandu takes off on Ranganayakamma for her writings

3. This anon guy shows up and asks proof for Ramayana.

What do you make out of this?


ఇదెలా ఉందంటే - తులసిదళం నవల యండమూరి బాగా వ్రాయలేదని ఎవరో అంటే వెంటనే దెయ్యాలున్నాయని ప్రూవ్ చెయ్యి అని అడిగినట్టు :))

Anonymous said...

Where is that comment that this fellow posted which said gravity is 9.81?

Bhardwaj Velamakanni said...

Gravity is 9.81 hmmmmm :))))))))))))