ఉద్దేశ్యం

ఈ బ్లాగు యొక్క ఉద్దేశ్యం విషవృక్షం పుస్తకాన్ని సమీక్షించి ఆ పుస్తకం రచయిత్రి రామాయణం గురించి చేసిన కువిమర్శలు/విషప్రచారాలను బయట పెట్టడం. ఇందులో రచయిత్రి వ్యక్తిగత విషయాలు గానీ, అసభ్య పదజాలం గాని ఉండదు. ఒక వేళ ఎవరి వ్యక్తిగత విషయాలైనా చర్చకువస్తే అది ఏదో ఒక విషయాన్ని స్పష్టం చేయడానికే తప్ప అవమానించడానికి మాత్రం కాదు. గమనించగలరు!

Monday 28 May 2012

రామాయణమే ఎందుకు??

ఈ  విష వృక్షం గురించి తెలిసినప్పుడు నాకు వచ్చిన మొదటి డౌటు "రామాయణమే ఎందుకు?? వేరే పుస్తకాల గురించి ఎందుకు రాయలేదు" వేరే పుస్తకాలంటే ఖురాన్, బైబిల్  లాంటివి కాదు. ఎందుకంటే వాటి గురించి రాసుంటే రాసిన రంగనాయకమ్మ పబ్లిష్ చేసిన పబ్లిషర్ ఇద్దరూ కాలగర్భం లో కలిసిపోయి కనీసం మూడు దశాబ్దాలు అయ్యేది. భారతం విషవృక్షం , భాగవతం విషవృక్షం లాంటివి రాసి ఉండచ్చు. తిట్టడమే ధ్యేయమైనప్పుడు ఏ పుస్తకాలైతే ఏం తేడా వస్తుంది?? పై పెచ్చు రాముడి ఆత్మ, సీత లో సీత లాంటి పాత్రలు సృష్టించడానికి  కూడా పుస్తకం ఏమిటన్నది అనవసరం. అయినా కూడా రంగనాయకమ్మ రామాయణాన్నే ఎంచుకుంది. దీనికి  నాకు తోచిన కారణాలు ఇక్కడ రాస్తున్నా..

౧. ఫలానా ఎవరు??
తెలుగు సినిమా డైరెక్టర్ యస్వీ కృష్ణారెడ్డి గారి మొదటి సినిమా పేరు "కొబ్బరి బోండాం". ఆ సినిమాకు ఆ పేరేందుకు పెట్టారని అడిగితే దానికి ఆయన ఇచ్చిన సమాధానం "ఆ పేరు వింతగా ఉంది కాబట్టి అందరూ సినిమా తీశింది ఎవరు అని ఇంటరెస్ట్ చూపిస్తారు, మొదటి సినిమా తర్వాత నాకు అది ఉపయోగ పడింది అని". రంగనాయకమ్మ కూడా ఖచ్చితంగా ఈ సిద్దాంతాన్నే వాడుకుంది. ప్రచారం రావాలంటే ఎదో ఒక గొప్ప పని చేస్తే రావాలి లేదా ఎవరైనా  ఆల్రెడీ ఫేమస్ వ్యక్తి ద్వారా రావాలి. రంగనాయకమ్మ నమ్మే మార్క్స్ -మావో ఈ దేశానికి ఏ మాత్రం సంబంధం లేని వారు.. వారి భజనలు ఎంతగా చేసినా ఎవరూ పట్టించుకోరు. అందుకని ఈ మార్గం లో వార్తలలో నిలిచింది. ఇందులో తప్పేమీ లేదు. కీర్తి కండూతి మనిషిలోని జ్ఞానాన్ని చంపేస్తుంది అంటారు.
౨. publicity mongering
౨౦౦౬ లో మొయిన్ ఖాన్ అనే పాకిస్తానీ క్రికెటర్  "సచిన్ కళ్ళల్లో భయాన్ని చూశాను" అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత రోజు  యాహూ సెర్చ్  టాప్ సెర్చెడ్ ఐటెంస్ లో మొయిన్ ఖాన్ పేరు ఉంది. రంగనాయకమ్మ చేసింది ఇదే.. చాలా కాలం క్రితం కవి సామ్రాట్ విశ్వనాథ గారు "రామాయణ కల్పవృక్షం" అనే ఒక పుస్తకం రాశారు. అందులో రామాయణం నుంచీ నేర్చుకోవాల్సిన విలువల గురించి రాశారు. కవి సామ్రాట్ రాసినదాన్ని విమర్శించారంటే సహజంగానే పాఠకులలో కుతూహలం ఉంటుంది దాన్ని సొమ్ము చేసుకోవచ్చు. ఈ రకంగా చేయడం తప్పూ కాదు అందులో ఏ రకమైన దోషం కూడా లేదు. ఎవరి మానసిక స్థాయికి తగ్గ పనులు వాళ్ళు చేస్తుంటారు. దానికి వాళ్ళను తప్పు పట్టలేము. స్వాతి చినుకు  ముత్యపు చిప్ప పైన పడితే అది ముత్యమౌతుంది తాచుపాము తలపై పడితే అది విషమౌతుంది.
౩. సినిమాల ప్రభావం:
విషవృక్షం మొదటి  పుస్తకం వచ్చింది ౧౯౭౫ ప్రాంతం లో.. అంతకు రెండు మూడు దశాబ్దాలుగా రాముడి గురించిన సినిమాలు   ప్రతీ రెండు మూడేళ్ళకు ఒక సూపర్ హిట్ సినిమా రానే వచ్చింది.ఇంక రామాయణం నాటకాలు, బుర్ర కథలు వగైరా వీటికి అదనం. ఇక భద్రాచలం లాంటి  ప్రసిద్ద పుణ్య క్షేత్రాల ద్వారా రాముడి గురించిన విషయాలు ఎప్పుడు ఏదో విధంగా చర్చలలో ఉండనే ఉంటాయి. ఇంత పాపులర్ అయిన రాముడి గురించి ఏం రాసినా అది వార్తే అవుతుంది. ఈ పాయింట్ ను రంగనాయకమ్మ పూర్తిగా వాడుకుంది.
౪. మార్కిజం:
రంగనాయకమ్మ  మార్క్సిస్ట్ అనే విషయం తెలిసిందే. ఆ సిద్దాంతాలను ప్రజలకు చెప్పాలి అంటే ముందుగా  సమాజం లో ఉన్నతంగా ఉండే వ్యక్తులను/విలువలను టార్గెట్ చెయ్యాలి. మన సమాజం లో రాముడు ఆ పొజిషన్ లో ఉన్నాడు (శతాబ్దాలుగా). ప్రతీ పురుషుడికి రాముడిని ఆదర్శ మూర్తిగా మన పెద్దలు చెబుతారు. అలాంటి రాముడి తెగడుతూ రాస్తే  "అసలు రాముడిని తిట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది?" అనే ఇంటరెస్ట్ పుస్తకం కొనేవాళ్ళు ఉంటారు. పైగా అవసరం అయినా లేకపొయినా తను నమ్మిన కమ్యునిజం గురించిన విషయాలు చెప్పటానికి ఒక ప్లాట్ ఫారం దొరుకుతుంది. (విషవృక్షం  పుస్తకం మొదటి పేజిలో "నీ గురించి నువ్వు తెలుసుకో, నువ్వు ఏ వర్గమో తెలుసుకో" -మార్స్కిస్ట్ అని ఉంటుంది.)

పైన చెప్పిన కొన్ని కారణాల వల్ల రంగనాయకమ్మ  తన పైత్య ప్రకోపాన్ని విశృఖలంగా ప్రదర్శించడానికి  రామాయణాన్ని ఎంచుకుంది.

ఇక ఇప్పుడు రంగనాయకమ్మ అభిమానులు ఈ పుస్తకం గురించి చెప్పిన విషయాలు చూద్దాం:
౧. స్త్రీ అభ్యుదయం వగైరా:
దీని గురించిన సమగ్రమైన చర్చ మరొక టపాలో చేస్తాను. (ఆ టపాకు ఇంకా కొంచెం టైం ఉంది)
అంతలోపు ఒక విషయం, స్త్రీల గొప్ప తనం గురించి రాయాలంటే  రాణీ రుద్రమ్మ దేవి నుంచీ  నేటి జాతీయోద్యమం వరకూ చాలామంది ధీరవనితలు ఉన్నారు. వారి గురించిన విషయాలు స్పూర్తిదాయకంగా రాయచ్చు. కానీ అవి ఎందుకు రాయలేదు?? కమ్యూనిస్టులకు భారతీయులు సరిపోరు అనుకుంటే ఫ్లోరెంస్ నైటింగేల్, జోన్ ఆఫ్ ఆర్క్ లాంటి వాళ్ళ గురించి కూడా రాయలేదు.. ఎందుకట?? male bashing is NEVER equal to woman empowerment.

౨.ఆ పుస్తకం   మూడు సార్లు పున:ముద్రణ పొందింది. అది ఈ పుస్తకం పాపులారిటీని సూచిస్తుంది:
మూడు సార్లు పున: ముద్రణ పిందడం ఏ పుస్తకానికైనా చాలా మంచి విషయం. కానీ పున:ముద్రణ వెనకాల ఉన్న  కారణాలను చూద్దాం:
అ) అప్పట్లో ఆడవాళ్ళకు పత్రికలు/పుస్తకాలు చాలా ఎక్కువగా చదివేవాళ్ళు. వాళ్ళను విక్టిమైజ్ చేస్తూ  రంగనాయకమ్మ బలిపీఠం లాంటి ఊకదంపుడు పుస్తకాలు రాసింది. సహజంగా  అలాంటి రచయిత నుంచీ వచ్చిన రచనలంటే వాళ్ళకు ఆసక్తి ఉంటుంది. ఆ లేడీ మార్కెట్ ను బాగా వాడుకుంది.
ఆ) మిషనరీలు రాముడిని దూషించడానికి తమ దేవుడు గొప్ప వాడని చెప్పుకోవడానికి ఈ పుస్తకాన్ని వాడుకుంటున్నారు. ౧౯౯౮ లో ఒకానొక మిషనరీ రామాయణ విషవృక్షం పుస్తకం లోని విషయాలను చూపిస్తూ రాముడిని కించపరచడం నేను చూశాను. అంతే కాక ఈ వ్యాసం రాయడానికి ముందు నాకు తెలిసిన కొందరు వీ.హెహ్.పీ. కార్యకర్తలకు ఫోన్ చేసి ఈ విషయాన్ని కంఫరం చేసుకున్నాను. వాళ్ళకు మిషనరీల మోడస్ ఆపరెండీ బాగా తెలుసు. మరి రంగనాయకమ్మ మిషనరీల దగ్గర నుంచీ ఎంత డబ్బు తీసుకుందో నాకు తెలీదు. 
ఇ) కమ్యూనిస్టులు ఈ  పుస్తకాన్ని తమ క్యాడర్లలో పంచడం.

౩. మొన్న మరొక కమ్యూనిస్టు చెప్పినట్టు వర్గ దృక్పథం:
సమాజమంతా ఎప్పుడూ ఒకటిగా లేదు. అది వర్గాలుగానే ఉంది అనేది కమ్యూనిస్టుల భావన. ఆ భావజాలాన్ని endorse చేసేందుకు ఈ పుస్తకం పనికి వచ్చింది.

సర్వేజనా సుఖినోభవంతు.
- రామదండు.
 

27 comments:

రాజ్ కుమార్ said...

post post kee padunu perugutundi ;O)

హై హై నాయకా said...

అదేమీ కాదు రాముడు కృష్ణుడంత రెబల్ కాదు. సాఫ్ట్ కేరక్టర్. ఎలా ఆడుకున్నా పరవాలేదని అనుకుని ఉంటుంది. నిజానికి రాముడి గురించి ఈ సోకాల్డ్ స్త్రీవాదుల కూతలు సీతాదేవిగానీ చదివితే చంపి పాతరేస్తుంది. ఆవిడ చదవదనే ఈ పిచ్చి కార్టూన్ల ధీమా. :)

Sri Kanth said...

వ్యాసములో అంకెలు తెలుగువి కాకుండా రోమన్ వి వచ్చేలా చూడండి. తెలుగు అంకెలు బొత్తిగా తెలీని వారు చాలా మందే ఉన్నారు కదా..!!

Bhardwaj Velamakanni said...

నిజానికి రాముడి గురించి ఈ సోకాల్డ్ స్త్రీవాదుల కూతలు సీతాదేవిగానీ చదివితే చంపి పాతరేస్తుంది. ఆవిడ చదవదనే ఈ పిచ్చి కార్టూన్ల ధీమా. :)
__________________________________________

Kevvvvv!

జీడిపప్పు said...

Wonderful Analysis. చాలా చక్కని ఉదాహరణలతో వివరిస్తున్న మీ ఓపికకు జోహార్లు!
http://100telugublogs.blogspot.in

రవి said...

publicity mongering: కల్పవృక్షాన్ని కేవలం వస్తుతః విమర్శించినవాళ్ళు వేదాంతాచార్యులు, దుర్గానంద్, ప్రభృతులు ఉన్నారు. వారు కవి పేరును కూడా విమర్శలో ప్రస్తావించలేదు. కొత్త సత్యనారాయణ చౌదరి కూడా చాలాభాగం తమ ఖండనలో కావ్యదోషాలను గురించి చెప్పారు.

విశ్వనాథను విమర్శిస్తే publicity వస్తుందన్న ఆలోచన హాస్యాస్పదం. ఆయన కావ్యంలో "లంజా", "కొండమ్రుచ్చుముండ", "దౌర్భాగ్యమాకారమైన దానా" వంటివి అశ్లీల, అమంగళకర, వ్రీడజనకాలున్నాయి. ఇది ఖచ్చితంగా దోషమే. ఇక "నాథమౌని","ప్రతిజ్ఞాభంగపుణ్యాబ్ధి","సభీతిరంభోనిధీ" వంటి దుష్టసమాసాలు,దుష్టాన్వయాలు,"కైక అడవికోడి కూసినట్టు నవ్వింది" వంటి నీచోపమలు,"నాయకుడు నాయకి చనుమొనలను నొక్కితే అవి కందిగింజలయాయి" వంటి అనౌచిత్య అసభ్య వర్ణనలు విమర్శనీయాలే.

హేమ్నః సంలక్ష్యతేహ్యగ్నౌ విశుద్ధిశ్యామికాపివా - పుటం పెడితేనే బంగారు విలువ తెలిసేది. విశ్వనాథ విమర్శకులను publicity mongers అనిచెప్పి తప్పుకునే ప్రయత్నం చేయకుండా, విశ్వామిత్రుడి వంటి మహర్షి, పురాణపురుషుడి చేత "లంజా" అన్న పదం ఎందుకు విశ్వనాథ ప్రయోగింపజేశాడో, కావ్యాదర్శ, కావ్యప్రకాశ, కావ్యాలంకారాది లక్షణశాస్త్ర గ్రంథాల రీత్యా ఇది అశ్లీల దోషం ఎలా కాకుండాపోతుందో తెలియజేస్తే బాగుంటుంది.అలాగే మిగిలిన విమర్శలకూనూ.

అట్లాగే ఊరికే విశ్వనాథను భట్రాజుల్లా పొగడకుండా, ఇలాంటి శబ్దాలున్న ఈ పుస్తకం ఎలా పారాయణగ్రంథమవడానికి అర్హం అవుతుందో, ఎలా ఈయన వాల్మీకికన్నా గొప్పవాడయ్యాడో వివరించడం చేస్తే భావితరాలవారికి బావుంటుంది.

Kavi said...

అనౌచిత్య అసభ్య వర్ణనలు విమర్శనీయాలే. అయితే రంగనాయకమ్మ తన పైత్యాన్ని కేవలం ఆ విషయాల మీద చూపిస్తే బాగుండేది.

Anonymous said...

అయ్యా!!!
నా అజ్నానాన్ని మన్నించితీరాలి మీరు.
మా ఇంట్లో రంగనాయకమ్మ, చలం, ఒషొ. లాంటి వారి పుస్తకాలు, ఇస్కాన్ ప్రచురణలు పూర్తిగా నిషేధం.
చూడటం గానీ చదవడం గానీ జరగలేదు.ఇంతకీ ఆవిడ ఎక్కడుంటారు? బతికున్నారా? లేక...

...ఆవిడ వ్యక్తిత్వదర్శనం మీ ద్వారా అవుతోంది....
చూస్తే మరింతచక్కగా అంచనా వెయ్యొచ్చని.

Jai Gottimukkala said...

"భారతం విషవృక్షం , భాగవతం విషవృక్షం లాంటివి రాసి ఉండచ్చు"

ఈ పుస్తకాలలోని అనేక అంశాలు ఈనాటి ప్రమాణాల ప్రకారం వివాదాస్పదంగా ఉన్నాయి. ఆయా గ్రందాలలోనే తగినన్ని విమర్శలు కనిపిస్తాయి. ఉ. ధర్మరాజు జూదాన్ని ద్రౌపది విమర్శించింది.

రామాయణం ఇంతకూ భిన్నంగా one sidedగా ఉంటుంది. ఎవరూ రాముణ్ణి విమర్శించిన దాఖలాలు లేవు.

Therefore it makes sense to pick Ramayana for criticism instead of other epics.

Sri Kanth said...

వెల్, వాలిని చంపడాన్ని, సీత అగ్నిప్రవేశాన్ని, వనవాసాన్నీ కూడా రామాయణములో ప్రశ్నించడం జరుగుతుంది రామాయణములో.

Jai Gottimukkala said...

@Srikanth M:

నేను original/classic రామాయణం చదవలేదండి. నాకు రామాయణం గురించి తెలిసింది రాజాజీ గారి తమిళ రచనకు ఆంగ్ల అనువాదం వల్లనే. మీరు చెప్పే వాలి వధ, సీత అగ్నిప్రవేశం లాంటి విమర్శలు రాజాజీ రామాయణంలో ఉన్నట్టు గుర్తు లేదు.

రాముడుకి ఉన్న మంచి పేరు (e.g. मर्यादाराम, సకల గుణాభిరాముడు) కృష్ణుడికి ఎప్పుడూ లేదు. This makes him a good target for any iconoclast.

Jai Gottimukkala said...

"వేరే పుస్తకాలంటే ఖురాన్, బైబిల్ లాంటివి కాదు"

You can try reading "Why I am not a Christian" by Bertrand Russel.

రామదండు said...

రాజ్ కుమార్,జీడిపప్పు గార్లూ
ఏదో మీ అభిమానం.

హై హై నాయక గారూ,
నిజం సూటిగా చెప్పారు.

కామ్రెడ్ శ్రీకాంత్ ;)
ఇక నుంచీ ఇంగ్లీష్ అంకెలు బ్రాకెట్లో రాస్తాను.

దుర్గేశ్వర గారూ,
మీ ఆశీర్వాదబలం మాష్టారు.


- రామదండు

రామదండు said...

రవి గారూ,

ప్రపంచం లో ఏది విమర్శనీయం, ఏది కాదు అనేది మన ఆలోచనలను బట్టి ఉంటుంది. విమర్శించాలనుకునే ఏ పుస్తకమైనా చదవడం మొదలు పెడితే అన్నీ విమర్శించాల్సిన విషయాలే కనిపిస్తాయి. ఈ విషయం మీకు తెలియంది కాదు.

>>విశ్వనాథను విమర్శిస్తే publicity వస్తుందన్న ఆలోచన హాస్యాస్పదం.

మీకు ఈ విషయం హాస్యాస్పదం అయ్యుండచ్చు కానీ అది విషవృక్షం విషయం లో జరిగిన నిజం.. ఒకవేళ పబ్లిసిటీ కోసం కాకపోతే రామాయణ విషవృక్షం అని కాకుండా రామాయణ కావ్య ఖండన అనో లేదా మరొక పేరో పెట్టి ఉండచ్చు. విషవృక్షం అనే పేరు పెట్టింది కేవలం పబ్లిసిటీ కోసమే..

రామదండు said...

అజ్ఞాత,
రంగనాయకమ్మ హై. లో ఉంటుందని విన్నాను.. కరెక్ట్ అడ్రస్ తెలియదు.

జై గొట్టిముక్కల గారూ,

మీ మొదటి కామెంట్ కొంచెం కంఫ్యూజింగ్ గా అనిపించింది. thanks for the clarification.
>>This makes him a good target for any iconoclast.
More importantly that will create a good market for the book.

- రామదండు

రామదండు said...

>>అట్లాగే ఊరికే విశ్వనాథను భట్రాజుల్లా పొగడకుండా, ఇలాంటి శబ్దాలున్న ఈ పుస్తకం ఎలా పారాయణగ్రంథమవడానికి అర్హం అవుతుందో, ఎలా ఈయన వాల్మీకికన్నా గొప్పవాడయ్యాడో వివరించడం చేస్తే భావితరాలవారికి బావుంటుంది.

విశ్వనాథ గారు వాల్మీకి కన్న గొప్పవాడని మేమెక్కడా చెప్పలేదు. ఎవరి కాలానికి తగ్గట్టు వారు రచనలు చేశారు. అవి పోల్చడం సరికాదని మా అభిప్రాయం. మేము విశ్వనాథవారికి భట్రాజులన్నారు, నిజానికి మేము రాములవారి భట్రాజులం. శ్రీ రామచంద్రుని ధర్మ నిరతిలో కనీసం వందోశాతం నేటి సమాజం లో ఉన్నా, చాలా సమస్యలు పరిష్కారం అయ్యేవని మా నమ్మిక.

రామదండు.

Jai Gottimukkala said...

@రామదండు:

"thanks for the clarification."

నేను నాస్తికుడినే. నా వ్యాఖ్య మీకు confusing గా ఎందుకు అనిపించిందో నాకు అర్ధం కావడం లేదు.

"More importantly that will create a good market for the book."

I doubt if this was the motivation. ఎన్ని పుస్తకాలు అమ్ముడు పోయాయన్నది ముఖ్యం కాదు. ఎంతమందిని ఆలోచించచేసిందనేదే ప్రధానం.

రామదండు said...

>>ఎన్ని పుస్తకాలు అమ్ముడు పోయాయన్నది ముఖ్యం కాదు. ఎంతమందిని ఆలోచించచేసిందనేదే ప్రధానం.
ప్రజలను ఆలోచింపజేయడమే ప్రధానమైతే ఈ పుస్తకం ఫ్రీగా పంచి పెట్టి ఉండచ్చు.. కానీ దాన్ని బజారులో అమ్మారంటే దాని వెనుక లాభాపేక్ష ఉన్నమాట వాస్తవం.

రవి said...

రామదండు గారు, నా వ్యాఖ్య కల్పవృక్షవిమర్శకులందరు publicity mongers అన్న విషయంపై మాత్రమే. రంగనాయకమ్మ పబ్లిసిటీ కోసం రాసిందని మీరు భావిస్తే నాకు ఇబ్బందేమీ లేదు. నేను రంగనాయకమ్మను పట్టించుకోను.

విశ్వనాథకు మీరు భట్రాజులని నా ఉద్దేశ్యం కాదు. అలా ధ్వనించి ఉంటే క్షంతవ్యుణ్ణి. ఆ వ్యాఖ్య విశ్వనాథను మూఢంగా అభిమానించేవాళ్ళకు ఉద్దేశించినది. ఆ బృందంలో మీరు లేకపోతే సంతోషమే.

Anonymous said...

విశ్వనాథకు మూఢాభిమానులు వుండరు, బాగా చదువుకున్న వారే ఆయన పుస్తకాలు చదువుతారు, కాబట్టి. రంగనాయకి లాంటి వాళ్ళకు వున్నదే (మూఢ) మార్క్సాభిమానులు.

మంచు said...

Wonderful Wonderful

ఏకబిగిన మూడు పార్ట్లు చదివించారు. ఒక్కొ అంశాన్ని ఎంతొ ఒపిగ్గా విశ్లేషిస్తూ సదరు విషపురుగు కుటిల యత్నాన్ని ఎండగడుతున్నందుకు ధన్యవాదాలు.

Jai Gottimukkala said...

@Anonymous:

విశ్వనాథకు లేనట్టే రంగానాయకమ్మకు కూడా మూఢాభిమానులు ఉండరు. ఇద్దరి రచనలు చదివేది బాగా చదువుకున్నవారే. (చదువుకున్నంత మాత్రాన మూర్ఖత్వం పోతుందా అంటారా అది వేరే విషయం).

ఈ "అభిమానం" రచయిత సిద్దాంతం మీద కానీ వ్యక్తి మీద కాదు. రచయిత నమ్మకాలను ఒప్పుకునే వారు ఆయనపై దాడి జరిగితే దాన్ని ఎదిరిస్తారు. They are defending their own interests by defending the author who shares these interests.

Anonymous said...

రంగనాయకమ్మ అభిమానుల స్థాయి వేరే, అదోటైపు, మార్తాండను చూస్తే ఈపాటికి మీకు అర్థమయ్యివుండాలి. చదువుకుంటే మూర్ఖత్వం పోతుందా అని ఎవరూ ప్రస్తావించలేదు. మరీ పట్టుబడితే, మీరు మీ హేట్-ఆంధ్ర మంద వుందిగా.
"రచయిత సిద్ధాంతం మీద, రచయిత మీద కాదు" మళ్ళీ అదే తీరు, తిప్పితిరిగేసి మీరే అంటారు, మీరే సరిదిద్దుకుని మురిసిపోతారు. నాయకి దాడీచేసింది రచయిత కల్పవృక్షం రాసిన తరువాతనే. రామాయణం వేల ఏళ్ళనుంచి వుంది, ఆవిడకి అప్పుడే రామాయణం తెలిసింది అని చెప్పకండి. మరీ దుర్భిణివేసి లేని ఈకలు పీకకండి మాస్టారూ.

Jai Gottimukkala said...

@Anonymous:

Clarification: నేను రంగనాయకమ్మ అభిమానిని కాను. ఆమె నాస్తికవాదంతో ఏకీభవిస్తాను కానీ ఆవిడ కమ్యూనిజం ఒప్పుకోను.

దీంట్లో తెలంగాణా లొల్లి ఎందుకు లెండి. మీరు గుంజితే నేను కూడా గుంజాల్సి వస్తుంది.

రంగనాయకి రచనను విమర్శించే హక్కు మీకెంత ఉందొ, రామాయణాన్ని విమర్శించే హక్కు ఆమెకూ అంతే ఉంది. రాముడు, వాల్మీకి లేదా విశ్వనాధ విమర్శకు అతీతులు కారు.

Anonymous said...

Well Said, Jai.

రామదండు said...

జైగొట్టిముక్కల గారూ,
ఈ మాత్రం దానికి క్లారిఫికేషన్లు గట్రా ఎందుకు లెండి. మనం ఎవరితోనూ అన్ని విషయాల మీద ఏకీభవించాలని లేదు.. మన స్వంత కుటుంబ సభ్యుల మధ్య కూడా ఎన్నో వైరుధ్యాలు. ఎటొచ్చి కొందరిని విమర్శించడం మాత్రమే అభ్యుదయమని, అదే అభివృధ్ధి అని వాదించే వారితోనే ఇబ్బంది.

Anonymous said...

తమరు ఐడి మాత్రమే మార్చుకుని వచ్చారనుకున్నా నాస్థికావతారం ఎత్తారని అనుకోలేదు, మంచిది. కులవ్యామోహం, ద్వేషం వదిలేశారా లేదా?
నాస్థికులకు, లేని రాముణ్ణి విమర్శించడమేమిటి అనే అనుమానం రాదాండి?