ఉద్దేశ్యం

ఈ బ్లాగు యొక్క ఉద్దేశ్యం విషవృక్షం పుస్తకాన్ని సమీక్షించి ఆ పుస్తకం రచయిత్రి రామాయణం గురించి చేసిన కువిమర్శలు/విషప్రచారాలను బయట పెట్టడం. ఇందులో రచయిత్రి వ్యక్తిగత విషయాలు గానీ, అసభ్య పదజాలం గాని ఉండదు. ఒక వేళ ఎవరి వ్యక్తిగత విషయాలైనా చర్చకువస్తే అది ఏదో ఒక విషయాన్ని స్పష్టం చేయడానికే తప్ప అవమానించడానికి మాత్రం కాదు. గమనించగలరు!

Sunday, 20 May 2012

పీఠిక లోనే మొదలైన పీడ - 1


ముందుగా రంగనాయకమ్మ విషవృక్షం పీఠికలో రాసిన ఈ క్రింద వాక్యాలు చదవండి.

ఈ కథ వల్ల మనకు స్పష్టమయ్యే విషయాలు:

౧. సమాజం అప్పటికే ధనిక పేద వర్గాలుగా విడిపొయింది..
౨. దశరథుడు, రాముడు,రావణుడు వంటి రాజులు ధనిక వర్గ ప్రతినిధులు. అసలు వాళ్ళే సిరిసంపదలు కల ఆస్తిపరులు, ధనికులు..
౩. స్త్రీలు అస్వతుంతృలుగా , వ్యక్తిత్వ శూన్యులుగా పురుషాంధకారపు నీడలో జీవచ్చవ జీవితాలు గడిపారు.
౪. సామాన్య ప్రజానీకం- పేదతనంలో, కులభేదాలలో ముష్టితనం లో, వేశ్యా వృత్తిలో , మత మౌఢ్యం లో , ఒక జాతిని ఇంకో జాతిని ఒక వర్గం ఇంకో వర్గాన్ని పీడించే యుద్దాలలో , వెయ్యి నిలువుల లోతున కూరుకుపోయి ఉన్నారు.
౫. పాలకవర్గ సాహిత్యము, దోపిడీ సంస్కృతి , సూక్ష్మ క్రిములై ప్రజల ఆస్తుల్ని, ఆత్మల్ని పట్టేశాయి.

పైన పేర్కొన్న విషయాలన్నీ  చాలా బరువైన ఆరోపణలు కానీ ఈ ఆరోపణలు ఏ కారణం తో చేసిందో రంగనాయకమ్మ ఎక్కడా చెప్పలేదు. సరే! పీఠిక లో అన్ని విషయాలూ విశదీకరించరు అని సరిపెట్టుకోవాలన్నా అంత ఆషామాషీగా తీసుకునే ఆరోపణలు మాత్రం కాదు. ఇలాంటి బరువైన ఆరోపణలు చేసేటప్పుడు కనీసం లేశమాత్రంగానైనా వివరాలు ఇవ్వకపోవడం ఈ పుస్తకం రాయడం వెనుక సదరు రచయిత ఉద్దేశ్యాలను అనుమానించాల్సివస్తోంది.రామాయణం చదివాక ఆమె ఈ ఆరోపణలు చేస్తోందా లేక ఇలాంటి ఆరోపణలు చెయ్యడానికి రామాయణం చదివిందా/చదివానని చెప్పుకునిందా??


ఇక ఈ పీఠికతో అత్యంత ముఖ్యమైన విషయం:

"రాముడు జ్యేష్ఠ కుమారుడైనా అతనికి రాజ్యం మీద హక్కు లేదు! రాజ్యం భరతుడిదే! ఎందుకంటే దశరథుడు కైకను పెళ్ళి చేసుకునేటప్పుడు కైక బిడ్డ కే రాజ్యం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ విషయం వాల్మికి రాసిందే . ఇది రామాయణానికంతటికీ ఆధారమైన ముఖ్య విషయం. ఇంత ముఖ్య విషయాన్ని కవి అల్ప విషయంగా ఒక మూలకు తోసేసి ,దాని సంగతి ఎప్పటికో ఎత్తాడు. రాముడు అడవుల్లో ఉన్నప్పుడు .. అప్పుడు బయటపడింది ఆ విషయం. పైగా రాముడి నోటి ద్వారానే ! అంటే, ఆ సంగతి రాముడికి మొదటినుండీ తెలుసన్నమాట."

వాల్మీకి ఈ విషయం ఏ పద్యాలలో రాశాడో రంగనాయకమ్మ చెప్పలేదు. కనీసం రామాయణం లోని ఏ  కాండ లో ఏ పద్యాలలో ఈ విషయాలు రాశారో చెప్పలేదు.

ఆ తర్వాతి వాక్యాలు ఇలా ఉన్నాయి:
రాముడికి భరతుడి హక్కు సంగతి తెలియక పోవడం వల్లనే పట్టాభిషేకానికి సిద్దపడితే అది రాముడి తప్పు అవదు. కానీ, ఆ  విషయం తెలిసీ రాముడు పట్టాభిషేకానికి సిద్దపడ్డాడంటే అది రాముడి కపటం అవదూ??

పితృ వాక్య పరిపాలన అనే నియమం రాముడు పాటించేవాడని రంగనాయకమ్మ చాలా  convenient గా మరిచిపోయింది. ఈ పితృవాక్య పరిపాలన గురించి మరింత విపులంగా ముందు ముందు చెప్పుకుందాం.

"భరతుడి  హక్కు సంగతి రాముడికి కూడా తెలుసు " అన్నట్టు కవి ఎందుకు రాశాడు?? రాముడికేమీ తెలియకే పట్టాభిషేకానికి అంగీకరించాడు  అన్నట్టు కథ నడపవచ్చు కదా?? కవి అలా ఎందుకు చేయలేదు?? - ఇలాంటి సందేహాలు చాలా వస్తాయి మనకి . కానీ ఈ కథలో కొన్ని సందేహాలకు జవాబులే దొరకవు.

రంగనాయకమ్మ తనకు వచ్చిన సందేహాలు అందరికీ వస్తాయాని/వచ్చాయని ఊహించి జెనరలైజ్  చెయ్యడం ఎంత వరకూ సబబో ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా.. కాకపోతే కొన్ని సందేహాలకు సమాధానాలు దొరకవు అనడం విడ్డూరం. ఆమెకు దొరకలేదంటే ఎవరికీ దొరకలేదని కాదు.ఇలాంటి జెనరలైజేషన్ వల్ల రచయిత మీద  గౌరవం తగ్గడం మినహా మరే ఉపయోగం లేదు. అసలు మనిషి జ్ఞాన సముర్పార్జన మొదలైంది సందేహాలతోనే ! తమ మేధస్సుకు అర్థం కాని సందేహాలకు సమాధానాలు దొరకాలంటే ఎవరైనా తమ కంటే పెద్దలను/అనుభవజ్ఞులను కలిసి కొంత మేధోమధనం చెయ్యాలి. రంగనాయకమ్మ లాంటి అపర మార్క్సిస్ట్ మేధావికి ఇంత చిన్న విషయం తెలియక పోవడం కడు విచారకరం.

మరొక విషయం:

రాముడికి రాజ్యం మీద హక్కే లేనప్పుడు ఇక రాముడికి జరిగిన అన్యాయం ఏముంది? రాముడికి రాజ్యం దక్కలేదని అందరూ శోకాలు పెట్టడం లో అర్థం ఏముంది?? దశరథుడు చివరికి రాజ్యాన్ని భరతుడికే ఇవ్వడానికే ఒప్పుకున్నాడంటే రాజ్యం భరతుడిదే అని తేలినట్టే కదా?? భరతుడి హక్కే నిజం అయితే రాముడి హక్కు అబద్దం అయిపోవలసిందే కదా?? "రామాయణం" కథే దాని గొప్పతనమే అబద్దం అయిపోతుంది కదా??

రాముడి కోసం అందరూ శోకాలు పెడితే మధ్య రంగనాయకమ్మ కు వచ్చిన ఇబ్బంది ఏమిటో ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.. దశరథుడు చివరికి రాజ్యాన్ని భరతుడికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడని రాసింది, అంటే మొదట రాముడికి ఇవ్వాలని అనుకున్నమాట నిజమే కదా.. రాముడికి రాజ్యం మీద హక్కు లేకుంటే రామాయణం గొప్పతనం అబద్దం అయిపోతుందని రంగనాయకమ్మ చెప్పిన కంక్లూజన్ అపరిపక్వంగా ఏదో ఒకటి విమర్శించడానికి అన్న మాటలుగా ఉన్నాయి తప్ప ఏమాత్రం పసలేదు. రామాయణం అంటే ఒక్క అయోధ్య కాండ మత్రమే కాదు, అందులో ఇంకా చాలా కథ ఉంది. సరే! ఆ కథ గురించి రంగనాయకమ్మ 750 పేజీలు రాసింది వాటిలో ప్రతీ పేజి గురించి నేను కూడా రాస్తాను. Let the party begin!!  


రామదండు

45 comments:

హనుమంతు said...

టైటిల్ అదరహో. చాల బాగ రాశారు. ఆవిడ అనుకున్నది నిజం. ఆవిడ అనుకుంటే రామయణం విషం - కమ్యునిజం అమృతం

రాంబంటు said...

టైటిల్ అదరహో. చాల బాగ రాశారు. ఆవిడ అనుకున్నది నిజం. ఆవిడ అనుకుంటే రామయణం విషం - కమ్యునిజం అమృతం

Malakpet Rowdy said...

:))))))))))

Praveen Mandangi said...

Mr రాంబంటు aka హనుమంతు, please read this: http://4proletarianrevolution.mlmedia.net.in/131991097

Pavani said...

Excellent and very timely attempt! Wish you all, all the best guys !

మనోహర్ చెనికల said...

Go ahead....

హై హై నాయకా said...

ప్రవీణ్ నీకు చేతనైతే ఇక్కడ కామెంట్ పెట్టు. లేదా మూసుకుని కూర్చో. అంతేతప్ప ఎక్కడో నీ బ్లాగులో ఓ పోస్ట్ పెట్టి ఇలా లింకులు ఇచ్చే పిచ్చి అలవాటు మానుకో.

ఇకపోతే నీ తొక్కలో పోస్ట్ కి జవాబులు ఇవిగో

"హిందువులలో రెగ్యులర్‌గా దేవాలయానికి వెళ్ళేవాళ్ళు తక్కువ, మత గ్రంథాలు చదివేవాళ్ళు అంత కంటే తక్కువ."

ఇది నువ్వెలా చెప్తావు? ఎప్పుడైనా గుడికి వెళ్ళిన మొహమేనా నీది? గుడికి వెళ్ళకుండా అక్కడికి చాలా తక్కువమంది వస్తారు అనడం గుడ్డివాడు ఏనుగు గురించి చెప్పడమే.

" హిందువులు వాళ్ళు చెపుతున్నంత సహనశీలులు కాదు. ........ ఎక్కువ మంది హిందువులు ఒక పుస్తకంపై అసహనం ప్రదర్శించకపోయినంత మాత్రాన వాళ్ళు సహనశీలులు అని అనుకోలేము."

ఓహో హిందువుల సహనశీలత నీకు ఇప్పటివరకూ కనిపించలేదా? ఇలాంటి పిచ్చి రాతలు రాసినా రంగనాయకమ్మ ఇంకా సమాజంలో స్వేచ్చగా తిరుగుతోందంటే అర్ధం కాలేదా? ఇదే ఏ ముస్లింలో అయితే ఈ పాటికి ఆమె మీద ఫత్వా జారీ అయ్యుండేది కాదా?

ఇంకో సారి తెలిసీ తెలియక పిచ్చి పిచ్చి కూతలు కూస్తే మర్యాద దక్కదు జాగ్రత్త.

రామమొహన్ said...

రంగనాయకమ్మ గారు విషవ్రుక్షాన్ని ముఖ్యంగా వర్గ ద్రుక్పదంతొ వివరించారు. ఆ వర్గ ద్రుక్పదం మీకు ఏ మాత్రం లేదని మొదట్లొనే అర్దమైపొయింది. పీఠికలొ రాసిన విషయాలు మీకు బరువైన విషయాలుగా తొస్తున్నాయంటె ఇక మిగతా విషయాలు మీకు ఎమి అర్దమౌతాయి. ?
ఆమె ఎప్పుడూ మతానికి సెకండరీ విషయంగా చుశారు మతాన్ని ఎంతవిమర్శించినా దొపిడీ వర్గాన్ని ఒక్క ఇంచికుడా కదల్చలేరు. ఆమె మొదటి ప్రాదాన్యం వర్గపొరాటమే. మార్కిజం ప్రకారం. రంగనాయకమ్మ గారిని , విషవ్రుక్షాన్ని , విమర్శించటాని మీరు అంత శ్రమపడనక్కర లేదు. మీకన్నా ముందే చాలా మందే ఆ పని చేశారు.

Praveen Mandangi said...

ముస్లింలు బ్లాస్ఫెమస్ (దైవ దూషక) రచయితగా భావించే సల్మాన్ రష్దీని అభిమానించేవాళ్ళలో నేను ఒకణ్ణి. ముస్లింలు నా మీద ఫత్వా వేస్తారో, గార్ధభాండం నా నెత్తి మీద బద్దలగొడతారో వాళ్ళ ఇష్టమ్. ఇండియాలో నిషేధించబడిన "The Satanic Verses" పుస్తకం గురించి నేను చెపితేనే తెలుగు బ్లాగులలో చాలా మందికి తెలిసింది. ఈ విషయం మజ్లిస్ నాయకులకి చెప్పు. వాళ్ళు ఫత్వాలు వేసి నన్ను ఏమి పీకుతారో పీక్కోవచ్చు.

Praveen Mandangi said...

మతాన్ని విమర్శించినంతమాత్రాన పెట్టుబడిదారులు ఒక ఇంచ్ కూడా కదలరు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం ప్రైవేట్ ఆస్తి హక్కులని పరిరక్షించుకోవడమే కానీ మత పరిరక్షణ కాదు కదా. ఈ విషయం మార్క్సిస్ట్‌లందరికీ తెలిసినదే. అటువంటప్పుడు మతం మీద పడి మేమేందుకు ఏడుస్తాము? మార్క్సిస్ట్‌లు వ్యక్తిగతంగా నాస్తికులు అయ్యుండాలి కనుక తిలకం బొట్లు పెట్టుకుని దేవాలయాలకి వెళ్ళే బివి రాఘవులు లాంటి వాళ్ళని విమర్శిస్తామ్, అంతే కానీ మతాన్ని ద్వేషిస్తే మాకు వచ్చేదేమీ ఉండదు.

తాడేపల్లి said...

బాలకాండలో చూడండి. శ్రీరామచంద్రమూర్తిని రాజుగా అభిషేకిస్తానని ప్రకటించే ముందు దశరథులవారు ఒక ప్రజాసభ ఏర్పాటుచేసి "మీకు రాజుగా ఎవఱు కావాలి ?" అని అడిగారు. వారు రాముడే కావాలని ఏకగ్రీవంగా కోరారు. దాన్ని బట్టి ప్రజల్ని సంప్రదించకుండా భరతుడికి రాజ్యమిచ్చే అధికారం దశరథులవారికి నేరుగా లేదనే తెలుస్తోంది. కాబట్టి దశరథులవారు కైకకిచ్చిన వరం ఆయన యొక్క ప్రైవేటు ఒప్పందమే తప్ప దానికి చట్టబద్ధత లేదు. కనుక రాములవారు రాజు కావడమే సరైనది.

వర్గదృక్పథం లేని సమాజాల ప్రవర్తనని వర్గదృక్పథంతో వివరించ బూనుకోవడం ఒక తెలివితక్కువతనం. ఆ కాలపువారికి మతదృక్పథమే ఉంది. ఆ సమాజాల్ని ఆ దృష్టితోనే అర్థం చేసుకోవాలి. ఏ సమాజాన్ని ఆ సమాజ దృక్పథంతోనే అర్థం చేసుకోవాలి. ఏ జాతిని ఆ జాతిదృష్టితోనే అర్థం చేసుకోవాలి. స్త్రీలని పురుషదృక్పథంతో అర్థం చేసుకుంటానంటే రంగనాయకమ్మగారు ఒప్పుకుంటారా ?

రామదండు said...

"ముఖ్యంగా వర్గ ద్రుక్పదంతొ వివరించారు."
వర్గ దృక్పదం లేక వక్ర దృక్పదమ.
"విమర్శించటాని మీరు అంత శ్రమపడనక్కర లేదు"
పర్లేదు మేము శ్రమ పడతాం మీరు కంగారు పడకండి

Praveen Mandangi said...

మీరు శ్రమ పడినా మాకు అభ్యంతరం లేదు. మార్క్సిస్ట్‌ల లక్ష్యం పెట్టుబడిదారీ వ్యవస్థని కూల్చడమే కానీ మతం మాకు ఎప్పుడూ సెకండరీ విషయమే. పెట్టుబడిదారులు దేవాలయాలకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టినా, ఉత్సవాలలో వేపాకులతో బాదుకుని నాట్యాలు చేసినా మాకు వచ్చే నష్టం ఏమీ ఉండదు.

హనుమంతు said...

"మార్క్సిస్ట్‌ల లక్ష్యం పెట్టుబడిదారీ వ్యవస్థని కూల్చడమే"
ఎప్పుడు కూల్చటమే కదా మీకు తెలిసింది. ఇంతకన్నా మీకు తెలిసింది చెయ్యగలిగింది ఏముంది కనుక.

రామమొహన్ said...

వర్గ ద్రుక్పదం అంటె మీకు కనీసమైన అవగాహన లేదని మీ వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. అకాడ సమాజం వర్గాలుగా విడిపొయి వున్నారనడానికి అక్కడు పాలించెవాడుగానూ, ఇంకొకరు పాలితులుగానూ, వున్నారంటెనే సమాజం వర్గాలుగా విడిపొయి వున్నాదని ఒక పెద్ద భండ గుర్తు.

హనుమంతు said...

పాలిచేవాడు, పాలితులు లేని దేశం ఏదో కాస్త చెపుతార ? మీరు చెప్పారు అంటే నేను ఇక నుండి వర్గ దృక్పదం అంటే ఆ దేశాలు అని భండ గుర్తు పెట్టుకుంటా ?

Anonymous said...

విషవృక్షంలో పరవీను పిడకలవేట. పరవీను నీకు రామాయనాలెందుకు గాని, ప్రజస్వామ్య హక్కులకోసం పోరాడుతున్న అంధుడు చెన్ గ్వాంగ్ చెన్‌ను హింసించే మార్కిస్టు లెనినిస్టు ప్రభుత్వ కార్యక్రమం ఎంత దాకా వచ్చింది? http://www.youngzine.com/article/saga-chinas-blind-activist
ఓ పోస్ట్ రాసి 10మార్లు ఇంపోజిషన్‌గా పోస్ట్ చేసి, ఆలింకు పోస్టర్లను ఎంగిలేసి పది బ్లాగుల్లో అంటించుకొచ్చి, కామెట్లేస్తారేమో అని కన్నుల్లో ఒత్తులేసుకుని అభిసారికుడిలా వెయిటింగు సెయ్. దొంగకోళ్ళు పట్టే మొహము ప్రెతి ఒడ్డోడూ రామాయణానికి విష భాష్యం చెబుతానని గోచీలుబిగించేవాడే.

SHANKAR.S said...

"ముస్లింలు నా మీద ఫత్వా వేస్తారో, గార్ధభాండం నా నెత్తి మీద బద్దలగొడతారో వాళ్ళ ఇష్టమ్. "

""The Satanic Verses" పుస్తకం గురించి నేను చెపితేనే తెలుగు బ్లాగులలో చాలా మందికి తెలిసింది. "

నీ గురించి నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు ప్రవీణ్. అంత సీన్ లేదు.

రామమొహన్ said...

ముందు మీరు ప్రదమిక విషయాలు తెలుసుకొని చర్చ చేస్తె బాగుటుంది. సమాజం కొన్ని వేల యెళ్ళుగా బానిస సమాజం నుంచి ఈ నాటి పెట్టుబడిదారీ సమాజం వరకు వర్గాలుగా విడిపొయి వున్న సమాజమే. అలా లేని సమాజం ప్రపంచంలొ యక్కడాలేదు. దాని కొరకు ప్రయత్నాలైతె జరిగాయి. రష్యా, చైనా లొ తర్వాత తిరొగమనం బాటపట్టెయి పెట్టుబడిదారీ వర్గం మళ్ళీ పైచేయి సాధించింది. అవి ఎందుకు పట్టెయొ ఇక్కడ చర్చించడం సాద్యం కాదు.

Praveen Mandangi said...

మతాన్ని విమర్శించినంతమాత్రాన పెట్టుబడిదారులు ఒక ఇంచ్ కూడా కదలరు, నాస్తికత్వాన్ని విమర్శించినంతమాత్రాన మార్క్సిస్ట్‌ల నెత్తి మీద నుంచి ఒక్క వెంట్రుక కూడా రాలదు. అలా జరుగుతుందనుకుంటే గార్ధభము అండముని ఉత్పత్తి చేస్తుందని అనుకున్నంత అమాయకత్వమే.

Anonymous said...

బండగుర్తులమీద దాస్‌కేపిటల్ లాగిచడమేకాని ఒక్క యెదవా అర్థచేసుకునే ప్రయత్నం చేయలేదా? రామమొహను

Praveen Mandangi said...

రామమోహన్ గారు, వీళ్ళతో చర్చించడం కంటే గుడ్డి గుఱ్ఱానికి పళ్ళు తోమడమే బెటర్. నాకు వేరే పని ఉంది. వీళ్ళు నేను తోకముడిచానని ప్రచారం చేస్తారని నాకు తెలిసే నేను వెళ్తానంటాను. నిజంగా అంత ఖాళీ టైమ్ ఉంటే ఊరి చివర పొలంలో గాడిదలు మేపుకుంటూ కూర్చుంటాను. వీళ్ళతో చర్చ అనవసరం.

Anonymous said...

పరవీనే వుత్పత్తి అవగా లేనిది గార్దభ అండం వుత్పత్తి అగదా.

బంతి said...

"గుఱ్ఱానికి పళ్ళు తోమడమే బెటర్."
"ఊరి చివర పొలంలో గాడిదలు మేపుకుంటూ కూర్చుంటాను."

ప్రవీణ్ పై రెంటి లో ఏది చెయ్యడానికి ఫిక్స్ అయ్యారు ?

రాంబంటు said...

"వీళ్ళు నేను తోకముడిచానని ప్రచారం చేస్తారని నాకు తెలిసే నేను వెళ్తానంటాను".

అబ్బే ప్రవీన్ మేము వానరాలను అవమానించం.

రాంబంటు

రామదండు said...

రామమోహన్ గారూ,
ఏ విషయాన్నైనా ఎవరి దృక్పథం తో వాళ్ళు ఆలోచిస్తారు.. అంతమాత్రం దానికి మీకు ఆ దృక్పథం లేదు మీకు ఈ దృక్పథం లేదు అని మీరు చెప్పడం మీ భావ దారిద్ర్యాన్ని సూచిస్తుంది తప్ప మరొకటి కాదు.
భక్తి దృక్పథమే లేని రంగనాయకమ్మ శంకరాభరణం సినిమాని ఎందుకు సమీక్షించినట్టు?? మరి మానవ దృక్పథమే లేని కమ్యూనిస్టులు మనుషుల గురించి మాట్లాడటం ఎందుకు??

ప్రవీణ్,
ఈ బ్లాగు కామెంట్ల సెక్షన్ ఉండేది టపాలపైన జరిగే చర్చలకోసం.. అంతే కానీ మీరు ఏదో లింక్ ఇచ్చి మార్కెటింగ్ చేసుకునేందుకు కాదు.

SHANKAR.S said...

అసలు నిన్ను ఇక్కడికి రమ్మని ఎవరు బ్రతిమాలారు ప్రవీణ్? ఏదో అన్నీ తెలిసినట్టు వచ్చేస్తావు. తీరా ఏదన్నా చర్చ మొదలయ్యేసరికి పెద్ద పుడింగిలా పోజుకొట్టి, పనుందన్న వంకతో పారిపోతావు. నీకేమీ తెలియదన్న విషయం నీకు తెలియకపోవడమే నీలో అతి పెద్ద లోపం.

రామదండు said...

మనోహర్,శ్రీరాం,హనుమంతు,పావని,మలక్ పేత్ రౌడీ గార్లకు
మీ అభిమానానికి కృతజ్ఞుడను.

రామదండు said...

తాడేపల్లి గారూ,
మంచి విషయాన్ని చెప్పారు.నెనర్లు.
అసలు రంగనాయకమ్మ విషవృక్షం ఎందుకు రచించింది అనేది వేరే చర్చ.. దాని గురించి మరిన్ని వివరాలు ఒక టపా ద్వారా తెలియజేస్తాను.

రామదండు said...

>>ముందు మీరు ప్రదమిక విషయాలు తెలుసుకొని చర్చ చేస్తె బాగుటుంది.

ముందు మీరు తెలుగు కరెక్ట్ గా రాయడం మొదలు పెడితే ఇంకా బాగుంటుంది.

నిప్పు నాగరాజు said...

//ఏ విషయాన్నైనా ఎవరి దృక్పథం తో వాళ్ళు ఆలోచిస్తారు.. అంతమాత్రం దానికి మీకు ఆ దృక్పథం లేదు మీకు ఈ దృక్పథం లేదు అని మీరు చెప్పడం మీ భావ దారిద్ర్యాన్ని సూచిస్తుంది తప్ప మరొకటి కాదు.
భక్తి దృక్పథమే లేని రంగనాయకమ్మ శంకరాభరణం సినిమాని ఎందుకు సమీక్షించినట్టు?? మరి మానవ దృక్పథమే లేని కమ్యూనిస్టులు మనుషుల గురించి మాట్లాడటం ఎందుకు??//

Claps..! అదిరింది..!

రామదండు said...

ప్రవీణ్,
నేటి కాలం లో గుఱ్ఱానికి పళ్ళు తోమడం, గాడిదలు మేపుకోవడం లాంటి ఆసక్తులు కలవాళ్ళు బహు అరుదు. మీకు మీ ఆసక్తులలో ప్రావిణ్యం కలగాలని ఆశిస్తున్నాను..

శ్యామలీయం said...

శ్రీమద్రామాయణం అనే మహాకావ్యాన్ని వ్రాయటంలో వాల్మీకి ఉద్దేశం ఆదర్శమానవుడిని గురించి మనకు తెలియజేయటమే.

ఏతత్కావ్యంలో బ్రహ్మాదులు రావణవధానంతరం 'నీవు విష్ణువు అవతారానివి' అనటం మీద బోలెడు వ్యాఖ్యానం చెయ్యవచ్చును. అది వేరే విషయం.

కాని క్రమానుగతంగా సమాజంలో రాముడిని ఆదర్శమానవుడిగానూ, దేవుడిగానూ కూడా గౌరవించటం జరుగుతూ వస్తోంది.

ఎవరి మాటకైనా, యే గ్రంధంలోని విషయాలకైనా అందుకు సమర్థులైన వాళ్ళు విపరీతార్ధాలు తీయటం కూడా కొత్త విషయం కాదు. రంగనాయకమ్మ రామునిలో పరమనికృష్టుడిని చూడటం ఆమె విజ్ఞతకూ, సంస్కారానికీ వదిలివేద్దాం. ఆవిడ వ్రాసిన విషవృక్షం సమాజాన్ని పెద్దగా ప్రభావితం చేయలేక పోయిందని నా అభిప్రాయం.

ఇప్పుడు ఆవిడగారి విషవృక్షంమీద చర్చించటం వలన పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చును. ఉభయపక్షాలవాళ్ళు కత్తులు నూరుకుందుకు యీ బ్లాగు ఒక వేదికగా మారటం తప్ప యేమీ ఒరొగేది లేదు. ఎవరూ తగ్గరు, మారరు.

వాదనలో విషయం మీద చర్చనడవటం కూడా నాకు అనుమానమే. కొందరికి చేతిలో అపరిమితంగా సమయం ఉండి యెక్కువ వ్రాయవచ్చును. అనేక మంది అలా చేయలేక పోవచ్చును.

చూసే కళ్ళలో కొంత ఉంటుంది. 'ఆత్మానం మానుషమ్ మన్యే, రామం దశరథాత్మజమ్' అన్న రాముడిలో వినయగుణం చూసేవారు ఉన్నట్లే, అతివినయం, కపటం చూసేవారూ ఉండవచ్చును. ఏం చెయ్యగలం.

ఈ జాతి వేలాది యేళ్ళు శ్రీమద్రామాయణంలో మంచిని చూసింది. ఇప్పుడు, కొందరు యెవరూ యిన్నాళ్ళూ చూడని చెడును చూసి అందరూ అలాగే చూడాలని వాంఛించటం జరుగుతోంది. నాకు దానిలో సామంజస్యం కనబడటం లేదు.

'మంధరాః పాపదర్శినీ' అన్నాడు వాల్మీకి. అలాగే నేటికాలంలో కొందరు (సాంప్రదాయకమైన)అన్నింటిలో చెడును మాత్రమే చూడగలిగటం కాల మహిమ. అంతే.

Srikanth M said...

రంగనాయకమ్మ రామాయణ విషవృక్షాన్ని ఎందుకు రచించింది?

సింపులు. మార్క్సిజాన్ని ప్రచారం చేయడానికి, అంతే. ఉత్తినే మార్క్సిజం ఇది అంటూ చెప్పుకుంటూ పోతే ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు కదా. అందుకే, దాన్ని ఉపయోగించి ఇదివరకే గొప్పవి అని ప్రజలు భావిస్తున్న వాటిని ధనుమాడి, దానికన్నా మా మార్క్సిజమే గొప్పది అని డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే ఇలాంటి పనులు చేయడం జరుగుతుంది. ఇదంతా తమ సిద్దాంత ప్రచారములో ఒక భాగం.

రామదండు said...

శ్యామలీయం గారూ,

విషయం మీరు చెప్పినంత సులువైనది కాదు. విషవృక్షం అనే పుస్తకం ఒక మతం పైన జరిగిన అమానుష దాడి. దీని వెనుక ఉన్న కారణాలు అనేకం.. అవన్నీ వివరించేందుకు ఒక టపా రాస్తాను..
ఇక గొడవల గురించి అంటారా, కమ్యూనిస్టులు విషయం మీద చర్చ చేసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు.. కాబట్టి ఈబ్లాగులో కూడా వారినుంచీ వేరేఏమీ ఆశించలేము. ఆ పైన కామెంట్ లోనే సదరు రామమోహన్ అనే ఆయన రాసిన కామెంట్ చూడండి, టపాకు ఏమాత్రం సంబంధం లేకుండా మీకు ఆ దృక్పథం లేదు, ఇవి తెలుసుకోవాలి అంటూ జడ్జిమెంట్లు.. వారి అజ్ఞానానికి జాలిపడటం తప్ప ఇంకేమీ చెయ్యలేము.. వీళ్ళ దృష్టిలో వీళ్ళు మాత్రమే అన్నీ తెలిసినవాళ్ళు మిగిలిన వాళ్ళు వీళ్ళు చెప్పినవి తెలుసుకోవాలి..

మావైపు నుంచీ మేము ఎవరి వ్యక్తిగత విషయాలు తీసుకురాము.. మేము పెట్టుకున్న నియమం ఇది..

కామ్రెడ్ శ్రీకాంత్ ;)
మార్క్సిజాన్ని ప్రచారం చెయ్యడం ఒక కారణం. అవి కాక ఈ పుస్తకం వెనకాల బోలెడన్ని జరిగాయి.. ఆ విషయ సంగ్రహణ పనిలోనే ఉన్నాను.. త్వరలో అవన్నీ రాస్తాను..

- రామదండు

puranapandaphani said...

good attempt

Anonymous said...

I was also victim of this VishaVriksham,Later I came out from that mud but still I keep that book in my shelf to show to my kids not to believe this kind of propaganda against Hinduism.
:venkat.

buddha murali said...

రామాయణ విషవృక్షం వచ్చిన రోజుల్లోనే దానిని ఖండిస్తూ రామాయణ విషవ్రుక్ష ఖండన అని లత రాసినట్టు గుర్తు . ఆ పుస్తకం లభిస్తే చూడండి

రామదండు said...

బుద్ద మురళి గారూ,
ఆ పుస్తకం దొరికితే చదవడానికి ప్రయత్నిస్తామండి. మీ సూచనకు నెనర్లు.

Anonymous said...

రాముడు తెలుగువారి ఆరాధ్యదైవుడు. మన రాష్ట్రంలో ఉన్నని రాముడి దేవాలయాల సంఖ్య మిగతా రాష్ట్రాలలొ లేవనిపిస్తుంది. మార్క్సిజం మొదట్లో ప్రచారం మొదలుపెట్టిన వారు రాముడి ప్రభావం తగ్గించేందుకు మార్క్స్ గారిని ఒక ఆదర్శపురుషుడిలాగా, పేద ప్రజల కష్ట్టాన్ని తీర్చే గొప్ప వ్యక్తి లాగా చిత్రికరించారు. వారు రాసిన పుస్తకాలన్నిటిలోను మార్క్స్ గారు పేద ప్రజలను ఉద్దరించటానికి పడే తపన, ఆయన పడిన కష్ట్టాలు ఎకరువు పెడుతూ పోయారు. ఆయన నిజంగా ఆ కష్ట్టలు అనుభవించి ఉండవచ్చు కూడాను. అతనిని ఒక ఆదర్శమానవుడిలాగా చిత్రికరిస్తూ, ఆకాశానికి ఎత్తేశారు. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఎమిటంటే మన రాష్ట్రంలో ఆసిద్దాంతం ఎక్కడా అమలుగరగపోయినా ఆయనని ఎందుకు అలా ఆకాశమంత ఎత్తుకు లేవనెత్తారు?

ఇక మన తెలుగు వామపక్ష రచయితల విషయానికి వస్తే వారికి ఎప్పుడు రాముడే టార్గేట్, అది త్రిపురనేని రామస్వామి చౌదరి అయినా , రంగనాయకమ్మ అయినా, ఓల్గ అయినా. వారంతా రాముడుని మాత్రమే అలా టార్గేట్ చేయటానికి ఎమీ కారణాలు ఉండవచ్చు.

SriRam

Anonymous said...

రాముడు తెలుగువారి ఆరాధ్యదైవుడు. మన రాష్ట్రంలో ఉన్నని రాముడి దేవాలయాల సంఖ్య మిగతా రాష్ట్రాలలొ లేవనిపిస్తుంది. మార్క్సిజం మొదట్లో ప్రచారం మొదలుపెట్టిన వారు రాముడి ప్రభావం తగ్గించేందుకు మార్క్స్ గారిని ఒక ఆదర్శపురుషుడిలాగా, పేద ప్రజల కష్ట్టాన్ని తీర్చే గొప్ప వ్యక్తి లాగా చిత్రికరించారు. వారు రాసిన పుస్తకాలన్నిటిలోను మార్క్స్ గారు పేద ప్రజలను ఉద్దరించటానికి పడే తపన, ఆయన పడిన కష్ట్టాలు ఎకరువు పెడుతూ పోయారు. ఆయన నిజంగా ఆ కష్ట్టలు అనుభవించి ఉండవచ్చు కూడాను. అతనిని ఒక ఆదర్శమానవుడిలాగా చిత్రికరిస్తూ, ఆకాశానికి ఎత్తేశారు. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఎమిటంటే మన రాష్ట్రంలో ఆసిద్దాంతం ఎక్కడా అమలుగరగపోయినా ఆయనని ఎందుకు అలా ఆకాశమంత ఎత్తుకు లేవనెత్తారు?

ఇక మన తెలుగు వామపక్ష రచయితల విషయానికి వస్తే వారికి ఎప్పుడు రాముడే టార్గేట్, అది త్రిపురనేని రామస్వామి చౌదరి అయినా , రంగనాయకమ్మ అయినా, ఓల్గ అయినా. వారంతా రాముడుని మాత్రమే అలా టార్గేట్ చేయటానికి ఎమీ కారణాలు ఉండవచ్చు.

SriRam

Anonymous said...

రాముడి ని పరోషంగా విమర్సిస్తూ విముక్త లాంటి పుస్తకాలు రాసే ఓల్గ ఎక్కడైనా మార్క్స్ పనిమనిషి తో సంబందం గురించి, ఆపనిమనిషితో పుట్టిన సంతానం గురించి ఎక్కడైనా తన కథల సంకలనాలలో విమర్శించిందా? ఈవిడ స్రీ సాహిత్యం పేరు తో తన రచనలను కథలతో మొదలు పెట్టి, దానికి తాత్వికతను జోడించటానికి మార్క్సిజం ఫ్రేం వర్క్ తీసుకొన్నారు.
ఓల్గ మార్క్సిజం ఫెమినిజం అనే పుస్తకం రాశారు.

SriRam

Anonymous said...

<<<<. వారంతా రాముడుని మాత్రమే అలా టార్గేట్ చేయటానికి ఎమీ కారణాలు ఉండవచ్చు.>>>>
రాముడు వాళ్ళను బాగా డిస్ట్రబ్ చేసుండచ్చు. మామూలు కారెక్టరా అది?
-----------------
అయితే నాకేమనిపిస్తుండంటే, రాముణ్ణి విమర్శంచటానికే కాదు సమర్ధించటానికి కూడా మనకు అర్హత ఉన్నదా అని మనం ఆలోచింఛాలి. ఆయనను మనమెంత ఆదర్శంగా తీసుకొన్నాము? ఎంతమందిమి రామాయణం పూర్తిగా, శ్రద్ధగా చదివాము? రామారావు తీనిన సిన్మాల ద్వారానో టీవీ సీరియల్ గానో కాక నిజంగా రామాయణం మన మనసులో ముద్రించుకొనేంతగా మనం చదివామా?
వేరే బ్లాగ్ లో రామాయణం వ్రాస్తున్నారు అది ఎంతమంది చూస్తున్నారు. ఇక్కడ ఎంత మంది ఉన్నారు?

ఈ కమ్యూనిష్ట్ లు నిజంగా కొన్ని సమస్యలపై చక్కటి ఆవగాహన కలవాళ్ళే. వోల్గా లాంటి వాళ్ళు వాళ్ళు నమ్మిన వాటికోసం జీవితాల్లో ఎంతో త్యాగాలు చేసారు. మన పని మనం చేసుకొనే మనకంటే సమాజం కోసం ఆలోచించే వీళ్ళు గొప్పే. అయితే జటిలమైన సమస్యలకు మూర్ఖంగా వాదించటం సొల్యూషన్ కాదు.
వాళ్ళు ఎంచుకొన్న మార్గం విధానం సరి కాదు. అది సమస్యలు తగ్గించక పోగా పెంచుతుంది.

వాళ్ళకు నచ్చిన వాళ్ళను మెచ్చుకోవచ్చు, సిద్ధాంతాలను ప్రచారం చెయ్యచ్బు కానీ ఇతరులను విమర్సించటం తప్పు కదా. దీన్లోనే పుణ్యకాలమంతా వెళ్ళదీస్తున్నారు ఈ అభ్యుదయ వాదులు.

చలం దమనం పాటించక పోయినా అది గొప్ప విషయం అని అయితే అందరికీ సాధ్యంకాదని చెప్పేడు. ఆయన భక్తి పేరుతో దుర్మార్గాలని చాటుగా చేసేవాళ్లని ఎగతాళి చేస్తూ కధలు వ్రాసారు. నాకు తెలిసి రాముణ్ణి, కృష్ణుణ్ణి ఇప్పటి రచయితల వలె వెకిలిగా వ్రాయలేదు.

సమాజంలో అన్ని వర్గాలకు సమన్వయం లేకుండా ఎవరికి వారు సిద్ధాంత పరంగా విడిపోతే మనం ఎక్కడకు పోతాం? ఎవరికీ మరొకళ్ళ ఆలోచన పై సహనం లేదు.

Anonymous said...

రామయణం స్త్రీమూర్తి గొప్పదనాన్ని ఇనుమడిస్తూ వ్రాసిన మహా కావ్యం. స్త్రీని బలవంతం చేసి అవమానిస్తే ఎంతటి శక్తిసంపన్నుడయినా నేలకొరగక తప్పదు అనే పచ్చి నిజాన్ని స్పష్టంగా చెప్పిన గొప్ప గ్రంధం .వాల్మీకి తలుచుకుంటే రావణుడిని చూసి ఒక్కక్షణం మనసు చంచలం పొందిన సీత సిగ్గుతో తనకు తానుగా అగ్నిప్రవేశం చేసి ఆ కళంకం తొలగించుకుంది అని వ్రాసేసేవాడు.ఇప్పటివరకూ రామాయణం చదివి విమర్శించిన వారిలో 100% రాముడిని తిట్టిపోసారే తప్ప సీతను ఒక్కమాట అన్న వారు ఎవరైనా ఉన్నారా? సీత వ్యక్తిత్వాన్ని, పవిత్రతను కించపరచగలిగారా?......సీతయే కాదు ఊర్మిళ, మండోదరి ఇతర స్త్రీమూర్తుల పాత్రలు అన్ని పేరుపెట్టని విధంగానే చిత్రీకరించారు..కైకేయి కూడా రాముడిని తన కుమారుని కంటే ప్రేమగా లాలించిన మాతృమూర్తి అని రావణ సం హారం నిమిత్తం ఈ నాటకం ఆడిందని కొన్ని గ్రంధాలలో చెప్పారు,కాకపోయిననూ ఆమె న్యాయమైన కోర్కెలు ఆమె కోరింది ..ఆ రకంగా రచయిత ఆ పాత్రని ఆమెను తప్పు పట్టడానికి వీలులేకుండా మలచారు.. ఇది ముమ్మాటికీ స్త్రీ మూర్తుల గొప్పతనాన్ని,విలువను లోకానికి చాటిచెప్పే గ్రంధం .

అటువంటి మహా కావ్యాన్ని తిన్నది అరక్కా విమర్శించే గొప్పతనం స్త్రీలు మాత్రమే చేయగలిగినందుకు ,వారి గ్రంధాన్ని వారే ఈకలు పీకి బ్రష్టు పట్టిస్తున్నందుకు సిగ్గుపడుతూ

ఓ ఆడది

రంగనాయకమ్మ గారికి మాత్రమే:
మీరు రాసిన విష వృక్షం కొంత మేరకు విన్నాను నేను చదవలేదు,అది చదివి రామ చంద్ర మూర్తిని,సీతను ,రామాయణాన్ని కించపరచలేను కాని ఒక్క మాట .... రాములవారి బట్టలను ఉతికి ఆరవేయ్యడానికే రాముడు సీతను అడవికి తీసుకువెళ్ళాడు ,సూర్పణక కోరిక తీర్చకపోవడం మగవాడి దుర్హంకారం లాంటి మీ సొంత పైత్యపు మాటలు వ్రాయడానికి మీకు పావుగంట పడితే సీతను అంతకంటే కించపరుస్తూ రాయడానికి మరో రంగనాధయ్యకు పదినిమిషాలే పడుతుంది.ఇటువంటి మహా కావ్యాలను మీ సొంత పైత్యాలకు వాడుకోవద్దు.

మీ పాపులారిటీకి మన ఇతిహాసాలను బలి చెయ్యకండి.మన మన్స్తత్వాన్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయి, మాకు రామాయణంలో మంచిమాత్రమే కనబడుతుంది. స్త్రీలను ఉద్దరించడం అంటే మగవాళ్ళను తక్కువ చెయ్యడమో,చులకన చెయ్యడమో కాదు.అది తెలుసుకోండి .

వంశీ కృష్ణ said...

ఏ కథలో అయిన నీతిని, మంచిని గ్రహించడం ఉత్తములు చేసే పని. అది వదిలేసి నీతిని, మంచిని విడిచి అందులో తనకి అనిపించినా తప్పుని ప్రచారం చేయడం..... ఆమె కే చెల్లింది