ఉద్దేశ్యం

ఈ బ్లాగు యొక్క ఉద్దేశ్యం విషవృక్షం పుస్తకాన్ని సమీక్షించి ఆ పుస్తకం రచయిత్రి రామాయణం గురించి చేసిన కువిమర్శలు/విషప్రచారాలను బయట పెట్టడం. ఇందులో రచయిత్రి వ్యక్తిగత విషయాలు గానీ, అసభ్య పదజాలం గాని ఉండదు. ఒక వేళ ఎవరి వ్యక్తిగత విషయాలైనా చర్చకువస్తే అది ఏదో ఒక విషయాన్ని స్పష్టం చేయడానికే తప్ప అవమానించడానికి మాత్రం కాదు. గమనించగలరు!

Thursday 24 May 2012

పీఠిక లోనే మొదలైన పీడ - 2: కొన్ని కామెడీలు

ముందుగా ఈ క్రింది వాక్యాలు చదవండి. ఇవి విషవృక్షం పుస్తకం యొక్క contents గురించి రంగనాయకమ్మ రాసినవి.

ఈ కథల్లో ముఖ్యంగా నాలగు విషయాలు ఉంటాయి:
1. కవి చెప్పవలసి ఉండి కూడా చెప్పనివి
2. చెప్పడానికి ఇష్టపడనివి
3. చెప్పినా మసిపూసి మారేడు కాయ చేసినవి
4. చాలా స్పష్టంగా చెప్పినవి

 1. కవి చెప్పవలసి ఉండి కూడా చెప్పనివి
ఇంతకంటే అర్థం లేని  వాదన ఏమన్నా ఉంటుందా?? వాల్మీకి మహర్షి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కూడా రంగనాయకమ్మనే నిర్ణయించాలా?? ఆయన పుస్తకం ఆయనకు నచ్చిన విధంగా రాసుకునే స్వతంత్రం ఆయనకు లేదా?? కమ్యూనిస్టుల కాలం లో పుట్టకపోవడం వల్ల ఆయనకు నచ్చిన విధంగా రాసుకునే హక్కు ఆయనకు ఉణ్ణింది. ఆ ప్రకారమే ఆయన రచించాడు.రంగనాయకమ్మ ఈ విషయం రాసింది సరే, కనీసం పుస్తకం అచ్చు వేసేటప్పుడు ఎడిట్ చేసే ఎడిటర్ కన్నా ఈ విషయం  వింతగా అనిపించలేదా??  సాటి రచయితకు( వాల్మీకి మహర్షి మరణించి ఉండచ్చు గాక)  కనీసం గౌరవం ఇవ్వలేదని అనిపిస్తోంది. 

2. చెప్పడానికి ఇష్టపడనివి
వాల్మీకి మహర్షికి ఏమి ఇష్టమో, ఏమి ఇష్టం లేదో కూడా రంగనాయకమ్మ నే డిసైడ్ చేస్తుందన్నమాట!!  శెబాసో!

3. చెప్పినా మసిపూసి మారేడు కాయ చేసినవి
ప్రతీ రచయిత/కవికి తమకంటూ ఒక శైలి అంటూ ఉంటుంది. వాల్మీకి మహర్షి ఆయన సొంత శైలిలో ఆయన రాశాడు. అంతమాత్రం దానికి మసిపూసి మారేడు కాయ చేశాడని అనటం ఎలాగైనా నిందించాలనే తపన తప్ప మరొకటి కాదు. My dear lady! Get Well Soon!

4.చాలా స్పష్టంగా చెప్పినవి
స్పష్టంగా చెప్పినవి అనేకంటే "నాకు స్పష్టంగా అర్థం అయినవి" అని రాసుంటే బాగుండేది. ఎందుకంటే ఆమెకు స్పష్టమైనవి అందరికీ స్పష్టం కావాలని రూల్ లేదు. ఆమె స్పష్టత ఏపాటిదో ముందు ముందు చూద్దాం.

ఇప్పుడు పైన చెప్పిన నాలగు కేటగిరీల గురించి రంగనాయకమ్మ రాసిన విషయాలు చూద్దాం:

1.కవిచెప్పవలసి ఉండి కూడా చెప్పనివి:
గొడ్లని కూడా పేజీల తరబడి వర్ణించిన కవి, 'ఊర్మిళ '  సంగతి ఎక్కడా ఎత్తలేదు. ఈపాత్ర గురించి ఒక్కమాటైనా చెప్పనవసరం లేదా?? భర్తతో అడవికి వెళ్ళిన సీత గొప్ప పతీవ్రత అయినప్పుడు, భర్తతో వెళ్ళని ఊర్మిళ సీత అంత పతీవ్రత అవదు కదా.. కాబట్టి, ఈ ఆధారంతో, ఊర్మిళ భర్త పట్ల అనాసక్తంగా ఉందని, ఈమె సీత అంత మహాపతివ్రత కాదని నేను రాస్తే, అది నా స్వంత కల్పన అవుతుందా?? ఇది మూలం లో లేని ఘటనే అయినా, "మూల విరుద్దం" అనటానికి వీలుందా??

ఒక స్త్రీ పాతివ్రత్యాన్ని బేరీజు వేయడం ఏమిటో?? దానికి మళ్ళీ  ఫలానా మెట్రిక్ ఆధారంగా అన్నాను అని చెప్పుకోవడం. ఇదే లాజిక్ ఒకానొక మహిళ కు ఆపాదిస్తే ఎలా ఉంటుంది అని నాకనిపిస్తోంది. కానీ పెద్దలు, గురువులు నేర్పిన సంస్కారం అడ్డం పడుతోంది. ఈ విషయం మీద మరింత చర్చ మరొక సందర్భం లో చేద్దాం. 
గొడ్లని కూడా అని రాయడం వెనుక జంతువుల పట్ల రంగనాయకమ్మకు ఉన్న చులకన భావం కనిపిస్తోంది. అది మానవ సహజమే అయినా ఒక పుస్తకం రాసేటప్పుడు ఇలాంటి వాక్యాలు రాకుండా చూసుకుంటే బాగుంటుంది. 

2. కవికి చెప్పడానికి ఇష్టం లేనివి:
రాముడు, లక్ష్మణుడు, సీతా అడవుల వెంటా, అప్పుడప్పుడూ పల్లెల వెంటా నడిచి వెళ్తూ ఉంటారు. వారికి దారి పొడుగునా "రుషులే" కాని ఇంకెవ్వరూ తారసపడరు. ఎందు చేత? పల్లెల్లో సామాన్య ప్రజలెవ్వరూ ఉండరా?? ఎందుకు ఉండరు?? ఉంటారు. కానీ వారిని గురించి చెప్పడం కవికి ఇష్టం లేని విషయం. ఎప్పుడూ రుషుల వంటి మహాత్ముల గురించే చెప్పాలి. కానీ అడవుల్లో ఆటవికులో కట్టెల మనుషులో కనపడ్డారని రాయడం వల్ల కావ్య సౌందర్యమేమీ కొరతపడదు. అయినా కవి అలాంటివారిని చెప్పలేదు. నేను, వాళ్ళని కూడా చెప్పాను. దారిలో అక్కడక్కడా కొందరు రైతులూ, కట్టెల మనుషులు, ఒక చాకలి, ఒక భిక్షకుడు జానపదులూ, ఇతర ప్రయాణికులూ తారసపడ్డారని నేను రాస్తే అది మూల కథకు విరుద్ధం అవుతుందా?? "అలా వీల్లేదు. అక్కడ పేదలు కనబడడం జరగదు. అది తప్పు" అని వాదించడానికి వీలౌతుందా??

నాకు పీఠిక మొత్తం లో ఎక్కువగా నవ్వు తెప్పించిన పేరా ఇదే.. అసలు కావ్యం లో లేనివి సుబ్బరంగా రాసేసి అది మూల కథకు విరుద్ధం కాదు వాదించడం ఏమిటో.. ఇలా మనకు కావాల్సినవి రాసుకుని దానికి మూలం "ఫలానా కథ" అని చెప్పడం తొండి ఆట (Foul Play). మరొక విషయం, అసలు రుషులు తప్ప ఇంకెవరి గురించి వాల్మికి మహర్షి రాయలేదనేది సత్య దూరం. అరణ్య వాసం మొదలు పెట్టాక గుహుడి గురించిన ప్రస్తావన ఉంది. కానీ రంగనాయకమ్మ ఆ విషయం మర్చిపోతుంది, ఎందుకంటే గుహుడు రాముడిని ఆరాధించాడు. వాదన చెయ్యాలంటే ఏదో ఒక కారణం ఉండాలి అంతేకానీ కేవలం వాదన కోసమే వాదిస్తే ఇలానే ఉంటాయి..  

మరొక కామెడీ:
ఒక పాత్ర ఒక అభిప్రాయాన్ని చెప్పినప్పుడు, ఆ పాత్రకి మనసులో కూడా అదే విధంగా ఉండనూ వచ్చు, ఉండకపోవచ్చు. మనిషి మనసులో తనకు ఇష్టం లేని విషయాలని, కార్యాల్ని ప్రశ్నించి, తర్కించి, వ్యతిరేకించే కంఠాలు ఉంటాయి. అందుచేత అలాంటి కంఠాలు కూడా విషవృక్షం కథల్లో పాత్రల్లా ఉంటాయి. ఆ పాత్రలు "రాముడి ఆత్మ", "లక్ష్మణుడి ఇంగితం", "సీతలో సీత" అనే పేర్లతో ఉంటాయి. అవి అప్పుడప్పుడూ వ్యక్తుల మనోభావాలను ప్రకటిస్తూ ఉంటాయి. ఇది మూల కథకు ద్రోహం చెయ్యడం అవదు. 

ఇప్పుడు పైన రంగనాయకమ్మ చెప్పిన లాజిక్ ను ఇంకొక చోట ఉపయోగించి చూద్దాం. మన ప్రారబ్దం బాలేక రంగనాయకమ్మ తన ఆత్మకథ రాసింది అనుకుందాం. అందులో "రంగనాయకమ్మ ఆత్మ" అని ఒక కంఠాన్ని ప్రవేసి పెట్టి ఆ పాత్ర చేత మనకు నచ్చిన విషయాలు రాసుకుంటే వాటికీ రంగనాయకమ్మ కు ఏమన్నా సంబంధం ఉంటుందా?? ఇది పూర్తిగా లేని భావాలను ఆయా పాత్రలకు తమకు అనుకూలంగా అంటగట్టడం తప్ప మరొకటి కాదు. పైగా ఇది మూల కథకు ద్రోహం కాదని ఆమెకు ఆమే సర్టిఫై చేసుకోవడం.  Anyways, Lets move on!

3.కవి మసిపూసి మారేడు కాయ చేసినవి
రాముడికి శతృపక్షం రాక్షసులు. ఈ రాక్షసులు ఏ జీవ శాస్త్రం లోనూ లేని కవి స్వంత సృష్టి. కథంతా దీని మీదే ఆధారపడి ఉంటుంది. కానీ ఈ కల్పనని యథాతథంగా అంగీకరించవలసిన అవసరం పాఠకులకు ఉండదు.

పాఠకులకు ఏమి అవసరమో ఏమి అనవసరమో పాఠకులకు తెలుసు వారి గురించి వకాల్తా పుచ్చుకోవాల్సిన అవసరం రంగనాయకమ్మకు ఎందుకు కలిగిందో పాపం..

4. కవి స్పష్టంగా చెప్పినవి:
కొన్ని విషయాలు కథలో ఎక్కడో ఒక చోట బయటపడతాయి.

ఎక్కడో ఒక చోట బయటపడే విషయాలు స్పష్టంగా చెప్పినవా?? కిం.ప.దొ.న.

(మరిన్ని విషయాలు మరొక పోస్టులో చూద్దాం)


రామదండు 

16 comments:

SHANKAR.S said...

"వాల్మీకి మహర్షికి ఏమి ఇష్టమో, ఏమి ఇష్టం లేదో కూడా రంగనాయకమ్మ నే డిసైడ్ చేస్తుందన్నమాట!! శెబాసో!"

అరే వావ్. నాకు తెలిసి లండన్ లో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నాను అని చెప్పుకు తిరిగే ఒక వ్యక్తి కూడా అచ్చం ఇలాగే అవతల వాళ్ళ అభిప్రాయలు, ఆలోచనలు కూడా తనే డిసైడ్ చేసేస్తాడు. తను మూర్ఖుడు అనుకుంటూ ఉంటా. ఈవిడా అంతేనన్నమాట. :)

రాజ్ కుమార్ said...

నాకు ఇప్పుడే ఆ బుక్ చదివెయ్యాలన్నంత ఆసక్తి గా ఉంది.
నాకు కామెడీ అంటే మక్కువ ఎక్కువ. పీడీఎఫ్ ఉందా??

Malakpet Rowdy said...

Strike 2 :)

రామదండు said...

శంకర్ గారూ,

ఇలాంటి కామెడీలు ఇంకా చాలానే ఉన్నాయిలేండి.. వచ్చేవారం మూడో భాగం పబ్లిష్ చేస్తా అందులో చదవండి blatant hatred తప్ప మరొకటి కాదు.

రాజ్ కుమార్ గారూ,
సాఫ్ట్ కాపీ అంటే కినిగె తప్ప వేరే మార్గం లేదు.

రామదండు

Sri Kanth said...

అందులో "రంగనాయకమ్మ ఆత్మ" అని ఒక కంఠాన్ని ప్రవేసి పెట్టి ఆ పాత్ర చేత మనకు నచ్చిన విషయాలు రాసుకుంటే వాటికీ రంగనాయకమ్మ కు ఏమన్నా సంబంధం ఉంటుందా??

సూపర్ ఐడియా. రేపు మనం కూడా మార్క్సు ఆత్మ, చలం ఆత్మ, రాజేశ్వరీ - అమీర్‌ల ప్రేతాత్మ అంటూ పెట్టి మైదానాన్ని నవలను, మిగిలిన నవల్ని ఆడుకుంటే నా సామి రంగా.. టైం చూసుకుని,ఏదో ఒక రోజు రాసేయాలి.. :-)

రామదండు said...

కామ్రెడ్ శ్రీకాంత్,

రంగనాయకమ్మ అలా రాయడం మూల విరుద్ధం కాదు అని తనకు తానే certify చేసుకుంది. ఇలాంటి సాహత్య ప్రక్రియ ఒకటి ఉందని మనకు తెలీదు.

Anonymous said...

ఈనాడు జర్నలిజం స్కూల్‌లో పుస్తక సమీక్ష అనే మంచి సంప్రదాయం ఉం(డే)ది. ప్రతీ వారం ఓ పుస్తకం గురించి సమీక్షించాలి. వాటిని బట్టి ఆ విద్యార్థులను అంచనా వేస్తారు. నేను దానిలో చదివేటప్పుడు ఓ వారం విషవృక్షం గురించి రాశాను. మీరిప్పుడు సుదీర్ఘంగా చేస్తున్న విశ్లేషణ లాంటిదే నేను స్థాలీపులాకంగా చేశాను. కొంతకాలం తర్వాత మా మా రాతలని వెనక్కిచ్చేటప్పుడు... విషవృక్షంపై నా సమీక్ష ప్రతి వెనక్కివ్వలేదు. :)

మొదటి సందేహ ప్రాణి said...

:)

Srikanth, I would like to help you with that.

రెండో సందేహ ప్రాణి said...

కలర్‍లీడరమ్మ గారికి ఈ బ్లాగు గురించి తెలియచేయాలి. ఆవిడని ఇది చదివి, కనీసం అప్పుడయినా బుద్ధి తెచ్చుకోమనాలి.

Malkpet Rowdy said...

Srikanth

I already started it - Rajeswari Aatma. Will be done in a couple of months.

Sri Kanth said...

I already started it - Rajeswari Aatma. Will be done in a couple of months.

LOL, పార్టీకి ముహూర్తం ఆల్రెడీ పెట్టారన్న మాట. ఎంజాయ్ చేయడానికి రెడీ. పనిలో పనిగా చలం మైదానం మీద నాకూ ఓచిన్న అభిప్రాయముంది. దాన్ని రాయడానికి ప్రయత్నిస్తాను.

రామదండు said...

ఫణి గారూ,
ప్రతీ వారం ఒక పుస్తక సమీక్ష అంటే చాలా మంచి సాంప్రదాయం.. సమీక్ష రాసిన తర్వాత ఆ పుస్తకం పైన చర్చలు/వాదనలు జరిగేవి కావా??

- రామదండు

రామదండు said...

రెండవ సందేహ ప్రాణి,
కాటికి కాళ్ళు జాచుకుని కూర్చున్న ఆమెకు ఈ బ్లాగు గురించి తెలిసినా తెలియకపోయినా పెద్ద ఉపయోగం లేదు. ఈ బ్లాగు గురించి తెలియాల్సింది ఆమె పుస్తకాలు చదివి జీవితాలు బుగ్గిపాలు చేసుకున్న/చేసుకుంటున్న యువతకు.

-రామదండు

జీడిపప్పు said...

Wondeful Blog!

తెలుగు సాహితీవనంలో ఉన్న ఒకానొక చీడపురుగు ఈ రంగనాయకమ్మ. తన జీవితం ఏదో అయిందని చెత్త రచనలు చేసి యువతకు, ముఖ్యంగా యువతులకు, విషపూరిత ఆలోచనలు ఎక్కించే ఓ అంటువ్యాధి అని నా own, personal స్వాభిప్రాయము.

Gopal said...

రంగనాయకమ్మ కు కళ్ళు పోయాయనుకుంటాను. ఎవరేనా చదివి వినిపించాలి, ఎవరికేనా ఓపిక ఉందా!

Anonymous said...

మేము రాసిన పరిచయాలని (నేను ఎప్పుడూ పుస్తక పరిచయం అనే రాసే వాడిని, సమీక్ష అనకుండా... నేను ఎంచుకున్న పుస్తకాలను సమీక్షించేంత శక్తి నాకు లేదని :)) ఓ మాస్టారు కరెక్షన్ చేసి మార్కులు వేసే వారు :) వాటిపై చర్చలా... :):) నాకు తెలిసి అలాంటిదేమీ జరగలేదు. నాకు అర్ధమైనంత వరకూ ఆ వ్యక్తికి అవగాహన చేసుకునే శక్తీ, రాయడంలో ఒడుపూ ఎలా ఉన్నాయో తెలుసుకోడానికే ఆ పని చేయించే వారనుకుంటా. అదే సమయంలో ఆ వ్యక్తి భావజాల ధోరణి తెలుసుకునే ప్రయత్నం కూడా.