ఉద్దేశ్యం

ఈ బ్లాగు యొక్క ఉద్దేశ్యం విషవృక్షం పుస్తకాన్ని సమీక్షించి ఆ పుస్తకం రచయిత్రి రామాయణం గురించి చేసిన కువిమర్శలు/విషప్రచారాలను బయట పెట్టడం. ఇందులో రచయిత్రి వ్యక్తిగత విషయాలు గానీ, అసభ్య పదజాలం గాని ఉండదు. ఒక వేళ ఎవరి వ్యక్తిగత విషయాలైనా చర్చకువస్తే అది ఏదో ఒక విషయాన్ని స్పష్టం చేయడానికే తప్ప అవమానించడానికి మాత్రం కాదు. గమనించగలరు!

Wednesday 8 August 2012

రాసేది రంగనాయకమ్మ అయితే చిడతలు వాయించేది చవటాయిలని ..

రంగనాయకమ్మ చెంచాలు విషవృక్షం గురించి ముఖ్యంగా చెప్పేది విషవృక్షంలో లాజిక్ చూడమని. అది కూడా చూద్దాం!

మన సోకాల్డ్ మహారచయిత్రి మాటల్లోనే క్రింది విషయంతో మొదలుపెడదాం.

1. "ఎందుకంటే దశరధుడు కైకని పెళ్ళి చేసుకునేటప్పుడు కైక బిడ్డకే రాజ్యం ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు"

2. "రాముడు అడవుల్లో ఉన్నప్పుడు.. అప్పుడు బయటపడింది ఆ విషయం"

3. "ఆ విషయం తెలిసికూడా రాముడు పట్టాభిషేకానికి సిద్ధపడ్డాడంటే అది రాముడి కపటత్వం అవ్వదూ?"


రామాయణంలోకి వస్తే ఆయోధ్యకాండ నాలుగవ సర్గ పదిహేనవ శ్లోకంలో దశరధుడు రాముడికి పట్టాభిషేకం విషయం చెప్తాడు. అదే సర్గలో రాముడు పట్టాభిషేకానికి సిద్ధమవుతాడు. మంథర పాత్ర ఏడవ సర్గ నుండీ మొదలవుతుంది. అంటే పట్టాభిషేకానికి సిద్ధపడేసమయానికి రాముడికి దశరధుడివరాల సంగతి తెలియదనే కదా? రంనాయకమ్మ లాంటి మార్క్సిస్టులకి ఆపాటి కనీస జ్ఞానం ఉంటే ఇంకేం?

ఇక అడవుల్లో రాముడు భరతుడితో అన్న మాటలివీ:

(అయోధ్యకాండ నూట ఏడవ సర్గ నుండి)

పురా భ్రాత: పితా న: స మాతరం తె సముద్వహన్
మాతామహె సమాష్రౌశీద్ రాజ్య శుల్కం అనుత్తమం


భ్రాత:= ఓ సోదరా!
పురా= పూర్వము (చాలా రోజుల క్రితం)
సముద్వహన్= పెండ్లాడేటప్పుడు;
తె మాతరం= నీ తల్లికి;
స:= అని
న: పితా= మన తండ్రి
సమాష్రౌశీత్= ప్రమాణము చేసెను
అనుత్తమం= ప్రత్యేకమయిన
రాజ్యషుల్కం= రాజ్యశుల్కం;
మాతామహె= మీ తాతగారికి

అంటే...

"ఓ సోదరా, మన తండ్రి నీ తల్లిని పెండ్లాడేటప్పుడు మీ తాతగారికి రాజ్యశుల్కమిస్తానని ఒప్పుకున్నారు"

ఇచ్చేది ఎవరికి? కైకేయి తండ్రికి.
కైకేయి తండ్రి దానిని తీసుకున్నాడా? లేదు.
అంటే అది కైకేయి తండ్రి తీసుకునేవరకూ దశరధుడి వంశానికే చెదుతుంది. ఒకవేళ తీసుకుని ఉంటే కైకేయి సోదరుడికి చెందుతుంది తప్ప, భరతుడికి చెందదు.

దాని తరువాత రాముడు భరతుడికి దశరధుడి వరాల సంగతి చెప్తాడు.. దాని గురించి కూడా పైనే చెప్పుకున్నాం. కనుక ఇక్కడ భరతుడి హక్కు, అది రాముడికి తెలియడం అనే ప్రసక్తి రానే రాదు.

కానీ రాసేది రంగనాయకమ్మ అయితే చిడతలు వాయించేది ఆవిడ చెంచాలే కదా!

ఇక వాల్మీకి రాముడి భజన గురించి. ఒక మూల కవి ఇలా ఎందుకు రాయలేదు, అలా ఎందుకు రాశాడు అని సన్నాయి నొక్కులు నొక్కుతూనే రామయణం అనేది వాల్మీకికంటే ముందునుండే ఉందన్న వాదన ఒకటి.

పనిమనిషికి కడుపు చేసి శిష్యుడి మీద వదిలేసిన మార్క్స్ గారికి మరి ఈవిడ చేసేదేమిటో? భజన కాదూ? చెంచాగిరీ కాదూ?


సర్వేజనా సుఖినోభవంతు
-రామదండు

11 comments:

Anonymous said...

excellent. andukondi veerataallu...

Anonymous said...

so this rises a question that whether the poison lady read the book or not?

Anonymous said...

పనిమనిషికి కడుపు చేసి శిష్యుడి మీద వదిలేసిన మార్క్స్ గారికి మరి ఈవిడ చేసేదేమిటో? భజన కాదూ? చెంచాగిరీ కాదూ?

Anonymous said...

Did Karl Marx impregnate his maid? I didnt know that. Is this why many communist women want free sex?

Malakpet Rowdy said...

ఒక రంగనాయకమ్మ అభిమాని నాతో:

" మీ చెంగనాయకమ్మ కాఫీక్లబ్ Facebook గ్రూపులో తిడుతున్నారు. మిగతావారు దానిని బహిష్కరించారని మీకు అర్థం కాలేదా? సిగ్గు లేదా"

నేను:

"ఏముందీ? దేశమంతా మీ రంగనాయకమ్మనీ, ఆవిడగారి అభిమానులనీ ఛీ కొట్టి మొహం మీద ఉమ్మేసినా తుడుచుకుని సిగ్గులేకుండా తిరిగెయ్యట్లా?

మీరు మమ్మల్ని బహిష్కరించారు. దేశం మొత్తం మీ మిమ్మల్ని బహిష్కరించిది - Big Deal?

"

Anonymous said...

"ఏముందీ? దేశమంతా మీ రంగనాయకమ్మనీ, ఆవిడగారి అభిమానులనీ ఛీ కొట్టి మొహం మీద ఉమ్మేసినా తుడుచుకుని సిగ్గులేకుండా తిరిగెయ్యట్లా?"

righto

Unknown said...

కామెడీ కి నెలలు నెలౌ కావాల? కమాన్...

Unknown said...

కామెడీ కి నెలలు నెలలు కావాలా? కమాన్...

Anonymous said...

రంగనాయకమ్మ తన పనికిమాలిన కామెడీకి సంవత్సరాలే తీసుకుంది కదా

thanooj said...

meerandaru ranga nayakamma gaari meeda kasi theera thittinanduku marx lo manchi lopalu vethinananduku harshisthunnanu . manam inkontha munduku podam ee viplaavaagnulni aaranivakandi sodurulaara.happy kids?

Anonymous said...

enti sir..busy ga unnaara..